మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. రెండు, మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది. స్వల్ప ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
ఏడో రౌండ్
ఏడో రౌండ్లో మునుగోడు మంటల ఓట్లను లెక్కించారు. ఏడో రౌండ్ ముగిసే సమయానికి 2,572 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 45,723 ఓట్లు రాగా.. బీజేపీకి 43,151 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్కు 12,025 ఓట్లు వచ్చాయి.