వరంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు..

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వరుసగా వస్తున్నాయి. తాజాగా తెలిసిన ఫలితాల ప్రకారం.. వరంగల్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దొమ్మటి సాంబయ్య మీద 326266 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మూడవ స్థానంలో బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి 77325 ఓట్లను సాధించారు. దీంతో వరంగల్ టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. రాష్ట్రం లో ఉన్న 17 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ ఐదుస్థానాలను గెలిచి మరో మూడు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.