బీజేపీలో చేరిన జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్

బీజేపీలో చేరిన జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్

ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని మైలార్‌దేవ్‌పల్లి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాష్ట్రంలో అమలవుతున్న చాలా పథకాల్లో కేంద్ర సాయం ఉందని.. కానీ, టీఆర్ఎస్ వాళ్లు మాత్రం సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ఆయన ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ మైలార్‌దేవ్‌పల్లిలో టీఆర్ఎస్ పార్టీ అట్టడున ఉన్నప్పుడు నేను పార్టీలో చేరి కార్పొరేటర్‌గా టికెట్ దక్కించుకున్నాను. ఎమ్మెల్యే, అతని అనుచరులు ఎన్ని కుట్రలు చేసినా తట్టుకొని గెలిచాను. ఆనాడు కేటీఆర్ బెదిరింపులకు భయపడి ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరాడు. టీఆర్ఎస్ పార్టీ 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెట్టిన మానిఫెస్టో‌ పూర్తిగా విఫలమైంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇచ్చిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు తొత్తుగా మారింది’ అని ఆయన అన్నారు.

For More News..

వీడియో: అరగంట పాటు లిఫ్ట్‌లో ఇరుక్కున్న తెలంగాణ మంత్రి

వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో 200 సీట్లను గెలుస్తాం

కోహ్లీ బర్త్‌డే వీడియో: తోటి ప్లేయర్లతో డ్యాన్స్ చేసిన కోహ్లీ.. ముద్దిచ్చి విష్ చేసిన అనుష్క