తెలంగాణ విషయంలో కేంద్రం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఇందులో భాగంగానే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆ ఫ్యాక్టరీని తెరిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. బయ్యారం విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ బుధవారం టీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు నామా ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్యాక్టరీ రాదని చెబుతున్నారని, ఆయన మాటలు అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రానున్న పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని నామా అన్నారు. మైనింగ్కు సంబంధించిన అధికారాలన్నీ కేంద్రం దగ్గరే ఉన్నాయని, చట్టంలో మార్పులు చేసి రాష్ట్రాలకు వాటిని బదలాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో మిగిలిన 49శాతం కేంద్రం వాటాను సైతం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అడిగినా మోడీ సర్కారు మాత్రం స్పందించడంలేదని చెప్పారు. మా భూభాగంపై ఉన్న హక్కును వదులుకొని బిడ్డింగ్లో ఎందుకు పాల్గొనాలని నామా ప్రశ్నించారు.
మరిన్ని వార్తల కోసం..