కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రమించిన టీఆర్ఎస్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. పిటిషన్పై రేపు విచారణ జరుపుతామని చెప్పింది. నిజానికి ఈ అంశంపై టీఆర్ఎస్ శనివారమే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇదేమంత అత్యవసరమైన కేసు కాదంటూ కోర్టు విచారణ జరిపిందుకు నిరాకరించింది. దీంతో టీఆర్ఎస్ ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణకు నిరాకరించింది. దీంతో పార్టీ తరఫు న్యాయవాది నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న విషయాన్ని ప్రస్తావించారు. టీఆర్ఎస్ గుర్తును పోలిన చిహ్నాలను తొలగించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను అభ్యర్థించామని అయితే అధికారులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. టీఆర్ఎస్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లంచ్ మోషన్ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని ప్రకటించారు. 

మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ హైకోర్టును కోరింది. కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని... ఫ్రీ సింబల్స్ నుంచి వాటిని తొలగించాలని టీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.