దైవభక్తితో మానసిక ప్రశాంతత
సూర్యాపేట, వెలుగు : దైవభక్తితో మానసిక ప్రశాంతత కలుగుతుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటకు చెందిన సంతోషిదేవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మహన్యాస రుద్రాభిషేకం, పార్థివ లింగాభిషేకం, గోపూజ, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గీత ఆశ్రమం వ్యవస్థాపకుడు చైతన్యానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య, ఎంపీపీ మర్ల స్వర్ణలతా చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొనతం సత్యనారాయణరెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
52 ఏండ్ల తర్వాత కలుసుకున్రు
నార్కట్‌పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొండల్వాయి ప్రైమరీ స్కూల్‌లో 1970 – -71లో ఐదో తరగతి చదువుకున్న వారు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. సుమారు 52 ఏండ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో కర్నాటి యాదగిరి, సంగం భిక్షమయ్య, ముద్దం స్వామి, బసిరెడ్డి ముత్తిరెడ్డి, ముద్దం వెంకయ్య, కుమారస్వామి, ఉస్మాన్, అబ్దర్ అలీ, నల్ల నర్సిరెడ్డి, స్వామి, సూర్యప్రకాస్, చింత పెద్దులు, కుక్కల కృష్ణయ్య పాల్గొన్నారు.
‘చందమామలు’ పుస్తకావిష్కరణ
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రముఖ కవి మునాసు వెంకట్ రాసిన ‘చందమామలు’ పుస్తకాన్ని ఆదివారం గాయకుడు, ఎమ్మెల్యే గోరటి వెంకన్న ఆవిష్కరించారు. ఉనికి సాహిత్య సామాజిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ క్లబ్ బిల్డింగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ భాషా సాహిత్యాలకు విశిష్ట స్థానం ఉంటుందన్నారు. నల్గొండ నుంచి ఉద్భవించిన అస్తిత్వ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందన్నారు. డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో ప్రముఖ విమర్శకులుడు అంబటి సురేందర్‌రాజు, సాహితీవేత్తలు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కోయి కోటేశ్వరరావు, బండారు శంకర్, తుల శ్రీనివాస్, కస్తూరి ప్రభాకర్, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, ఎంవీ.గోనారెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
నార్కట్‌పల్లి/చౌటుప్పల్, వెలుగు : బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సూచించారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన బీజేపీ నాయకుడు శేపూరి రవీందర్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆదివారం ఆయనను పరామర్శించారు. ఆయన వెంట పట్టణ, మండల అధ్యక్షుడు కూరెళ్ల శ్రీను, పొట్లపల్లి నర్సింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్దన్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కన్నెబోయిన మహాలింగం ఉన్నారు. అలాగే చౌటుప్పల్ మండలం ధర్మాజీగూడెం చెరుకు లక్ష్మమ్మ చనిపోవడంతో ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదే గ్రామానికి చెందిన పగిళ్ల నర్సిరెడ్డి ఇటీవల చనిపోడవంతో ఆయన ఫ్యామిలీని పరామర్శించి రూ. 10 వేల ఆర్థికసాయం అదంజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్నం లావణ్య మల్లేశ్, అంకిరెడ్డిగూడెం సర్పంచ్ ముద్దం సుమిత్ర సత్తయ్యగౌడ్, దూడల భిక్షం పాల్గొన్నారు.
హెల్త్ క్యాంప్‌ను వినియోగించుకోవాలి
యాదగిరిగుట్ట, వెలుగు : గ్రామాల్లో ఏర్పాటు చేసే హెల్త్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య సూచించారు. హైదరాబాద్‌కు చెందిన సాయికృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఆదివారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంప్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి క్యాంప్‌ల నిర్వహణ వల్ల రోగాలను తొలిదశలోనే గుర్తించొచ్చన్నారు. మెడికల్ క్యాంప్‌లో 513 మందికి ఫ్రీగా టెస్టులు చేసి అవసరమైన వారికి మందులు ఇచ్చినట్లు చెప్పారు. ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య, మాజీ ఎంపీటీసీ గోపగాని గోపాల్‌గౌడ్, సాయికృష్ణ హాస్పిటల్ డాక్టర్లు అనిల్‌కుమార్, ప్రకాశ్, సత్యంయాదవ్, సీతల్‌కుమార్, ఏఆర్ రెడ్డి, ప్రణయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపు
యాదగిరిగుట్ట, వెలుగు : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మరోసారి విజయం సాధించడం ఖాయమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురానికి చెందిన పలువురు ఆదివారం యాదగిరిగుట్టలో మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి ఆయన టీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆలేరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో బొమ్మలరామారం మండల అధ్యక్షుడు పొలగోని వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, వైస్‌ఎంపీపీ గొడుగు చంద్రమౌళి, ఎంపీటీసీ పాంచ్యా నాయక్, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి
పాల్గొన్నారు.
డివైడర్ మూసేసిన పోలీసులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా వద్ద హైవేపై ఉన్న యూటర్న్‌ను పోలీసులు మూసివేయడంతో ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్ నుంచి మునుగోడు నియోజకవర్గానికి వెళ్లేందుకు ఈ రోడ్డు ఒక్కటే మార్గం. ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డును మూసివేయడంతో ప్రయాణికులు సుమారు మూడు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. అయితే అధికార పార్టీ, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఉన్నప్పుడు ఈ రోడ్డును ఓపెన్ చేస్తున్న పోలీసులు సామాన్య ప్రజల ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ యూ టర్న్‌ను ఓపెన్ చేయాలని పలుమార్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే చౌరస్తా వద్ద తాత్కాలికంగా ఉన్న ఇనుప గేట్ల ఫొటోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు పర్మినెంట్ డివైడర్లు ఏర్పాటు చేశారు.
చిన్న కేసుల్లో రాజీ ఉత్తమం
మేళ్లచెరువు, వెలుగు : చిన్న చిన్న గొడవల్లో కేసులు పెట్టుకుని కోర్టును ఆశ్రయించడం కంటే రాజీమార్గమే మంచిదని హుజూర్‌నగర్ జూనియర్ సివిల్ జడ్జి సాంకేత మిత్ర చెప్పారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం యతిరాజాపురం తండాలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కోర్టుకు రావాలని, సాక్షులు ప్రభావితం కాకుండా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఏఎస్సై ఆనంద్‌నాయక్, లాయర్లు రాఘవరావు, నాగార్జున, సురేశ్‌నాయక్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
నాటకరంగ అభివృద్ధికి సహకరిస్తాం
మిర్యాలగూడ/కోదాడ, వెలుగు : నాటకరంగ అభివృద్ధికి సహకారం అందిస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ చెప్పారు. త్యాగరాజ నాట్య కళా పరిషత్, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో పులి శేషయ్య స్మారక నాటకోత్సవాలను శనివారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు. నాటకాలను ఆదరించి కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో పుల్లాభట్ల కృష్ణమూర్తి, పులి కృష్ణమూర్తి, తడకమళ్ల రాంచందర్‌రావు, కళాకారులు వెంకటరామశర్మ, లక్ష్మయ్య, సురభి కొండల్ రావు పాల్గొన్నారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి
న కార్తీక వనభోజనాలకు ఎమ్మెల్యే భాస్కర్‌రావు హాజరయ్యారు.