నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

 నిజామాబాద్,  వెలుగు: క్రీడలకు సంబంధించి సంస్థల్లో అధికార పార్టీ జోక్యం పెరుగుతోంది. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలను టీఆర్ఎస్  ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ పోస్ట్‌‌‌‌కు ఏకంగా ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లు గడీల రాములు, ఈగ సంజీవ్‌‌‌‌రెడ్డి, హన్మంత్‌‌‌‌రెడ్డి పోటీ పడుతుండడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న గడీల రాములు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌‌‌‌కు బంధువు. ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీరి మధ్య ప్రస్తుతం దూరం పెరిగింది. దీంతో పాటు రాములు అసోసియేషన్ స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఈసారి గోవర్ధన్ మరో సీనియర్ నేత ఈగ సంజీవ్‌‌‌‌రెడ్డికి మద్దతు ఇస్తున్నారు.   

9 ఏండ్లు ఎన్నికల్లేవు..

 జిల్లా ఒలంపిక్​ అసోసియేషన్‌‌‌‌ 1998లో ప్రారంభమైంది. అడ్‌‌‌‌ హక్ కమిటీ ప్రెసిడెంట్‌‌‌‌గా రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి రెండు సార్లు కొనసాగారు. 2006లో బాగిర్తి బాగారెడ్డి,  2014లో గడీల రాములు ప్రెసిడెంట్‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఆతర్వాత  9 ఏండ్లుగా ఎన్నికలు జరుగలేదు.  ​ సంఘాన్ని రద్దు చేసి.. అడ్‌‌‌‌హక్​ కమిటీని  ఏర్పాటు చేసినా రాములు పదవిలో కొనసాగుతున్నారు. దీంతో ఒలంపిక్ సంఘం రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో జిల్లాలో స్పోర్ట్స్ యాక్టివిటీస్‌‌‌‌పై నీలినీడలు అలుముకున్నాయి.  జిల్లా బాక్సర్ నిఖత్ ప్రపంచ ఛాంపియన్‌‌‌‌గా నిలిచినా జిల్లాకు బాక్సింగ్ అకాడమీ మంజూరు చేయించుకోవడంలో ఆసోసియేషన్ పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న దాదాపు 10 మంది బాక్సింగ్ క్రీడాకారులను  ప్రొత్సహించడం లేదన్న  ఆరోపణలు ఉన్నాయి. 

46 మంది ఓటర్లు 

ఈనెల 13న  జిల్లా ఒలంపిక్ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా సంఘానికి 33 క్రీడా సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో 9 క్రీడాసంఘాలకు ఒలంపిక్ సంఘం గుర్తింపు లేకపోవడంతో వాటికి  ఓటింగ్‌‌‌‌లో పాల్గొనే దూరంకాగా 24 సంఘాలకు సంబంధించిన 48 మందికి  ఓటు హక్కు ఉంది. ఇందులో ఇద్దరు సభ్యులు చనిపోగా 46 మంది ఓటు వేయనున్నారు.  ‌‌‌‌

స్థల కబ్జాకు ప్రయత్నించిండు

గడీల రాములు ఒలింపిక్​ సంఘ స్థలాన్ని కబ్జా కు ప్రయత్నించిండు. సంఘం యాక్టివిటీస్​పట్టించుకోలె. టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా   వసతులు  కల్పించడంలో ఫెయిల్యూర్ అయిండు. ప్రెసిడెంట్ హోదాతో అక్రమాలకు పాల్పడిండు. 
– బొబ్బిలి నర్సయ్య , రైఫిల్ షూటింగ్ సంఘం ప్రెసిడెంట్ 

కబ్జా ఆరోపణలు ఉత్తవే..
ఒలంపిక్​ సంఘ స్థలం కబ్జా ఆరోపణలు అవాస్తవం. ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  9 ఏళ్లుగా జిల్లా క్రీడారంగం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని సర్కార్‌‌‌‌ను కోరాం.  
– గడీల రాములు, సిట్టింగ్​ ప్రెసిడెంట్

భూమి కోసం అన్నను మర్డర్ చేయించిండు

కామారెడ్డి, వెలుగు: ఎకరం భూమి విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదంలో సొంత అన్నను సుపారీ గ్యాంగ్‌‌తో హత్య చేయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అన్నను చంపేందుకు సుపారి గ్యాంగ్‌‌ రూ.80 వేలకు తమ్ముడు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ కేసులో తమ్ముడితో పాటు ఐదుగురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇందులో నలుగురు నిందితులు వివిధ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన వారే ఉన్నారు. ఎస్పీ బి.శ్రీనివాస్‌‌రెడ్డి తన ఆఫీసులో మీడియాకు వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలం ఎల్పుగొండకు చెందిన నిమ్మ మల్లయ్య, నిమ్మ నర్సింహులు అన్నదమ్ములు. వీరి మధ్య ఎకరం భూమి విషయంలో గొడవ ఉంది. అన్న నిమ్మ మల్లయ్యను చంపాలని తమ్ముడు నర్సింహులు భావించాడు.  ఇది తనతో సాధ్యం కాదని  భావించి తనకు తెలిసిన దోమకొండ మండలం కొనాపూర్‌‌‌‌కు చెందిన  మాజీ మిలిటెంట్ యేల దేవరాజును సంప్రదించారు.  బీబీపేట మండలం యాడారానికి చెందిన అల్లెపు రమేశ్‌తో మర్డర్​ చేయిస్తానని యేల దేవరాజు చెప్పారు. సులభంగా డబ్బులు సంపాధించవచ్చనే  ఉద్దేశంతో అల్లెపు రమేశ్​ మర్డర్‌‌‌‌కు ఒప్పుకున్నారు. మల్లయ్య మర్డర్‌‌‌‌కు రూ.80 వేలతో అగ్రీమెంట్ జరిగింది. ఈనెల 3న రూ.30 వేలు అడ్వాన్స్‌‌గా ఇచ్చారు. మిగతా అమౌంట్ మర్డర్‌‌  తర్వాత ఇస్తానని చెప్పారు. అల్లెపు రమేశ్ తన ఇద్దరు బామ్మర్ధులు పల్లవు రమేశ్, పల్లవు శ్రీకాంత్‌‌తో కలిసి మర్డర్  ప్లాన్‌‌ చేశారు. ఈనెల 4న నిమ్మ మల్లయ్య, చిన్న రాములు ఇద్దరు బైక్‌‌పై పల్వంచ మర్రి  వద్ద ఉన్న వైన్స్‌‌కు వచ్చి మందు సీసా కొనుక్కుని వెళ్తున్నారు. అప్పటికే  వారిని ఫాలో అవుతున్నారు. చీకట్లోకి వెళ్లిన తర్వాత పల్లవు రమేశ్ నిమ్మ మల్లయ్యను  కట్టెలతో నెత్తి మీద కొట్టి కత్తిలో గొంతు గోసి మర్డర్ చేశారు. ఇతడి వెంట ఉన్న చిన్న రాములును కూడా తలపై కొట్టి గాయపర్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. మల్లయ్య ఘటన స్థలంలోనే చనిపోగా, గాయ పడిన చిన్న రాములు కామారెడ్డి హాస్పిటల్‌‌కు తరలించారు. డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మర్డర్ కేసులో నిమ్మ నర్సింహులు, పల్లపు రమేశ్, అల్లెపు రమేశ్, పల్లపు శ్రీకాంత్, యేల దేవరాజును అరెస్టు చేసి రిమాండ్‌‌కు పంపినట్లు తెలిపారు. వీరి నుంచి రూ.26,500 నగదు, 6 సెల్​ఫోన్లు, కత్తి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.   దర్యాప్తులో చురుగ్గా వ్యవహారించిన డీఎస్పీ సోమనాథం, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సంతోష్​కుమార్, అనిల్​కుమార్‌‌‌‌ను ఎస్పీ అభినందించారు. 

ప్రధాని సభను సక్సెస్‌‌ చేయాలి

బాన్సువాడ, వెలుగు: రామగుండంలో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ఆర్‌‌‌‌ అండ్‌‌ బీ గెస్ట్‌‌ హౌస్‌‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండంలో రూ.6,120 కోట్లతో పునరుద్ధరించిన ఎరువుల కర్మగారాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 నియోజకవర్గాల్లో ఎల్‌‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ చిదుర సాయిలు, లక్ష్మీనారాయణ, కోణాల గంగారెడ్డి, చీకట్ల రాజు, తూప్తి శివప్రసాద్, రాజాసింగ్, కొండని గంగారం, పోల్కం గోపాల్, విశాల్, నాంపల్లి శ్యామ్, భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్, రామకృష్ణ పాల్గొన్నారు. 

పీఎం ప్రోగ్రామ్‌‌ చూసేందుకు స్క్రీన్ ఏర్పాటు

కామారెడ్డి, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరిని కేంద్రం రూ.6,120 కోట్ల ఫండ్స్​తో  పునరుద్ధరణ చేసి శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తున్న  ప్రోగ్రామ్‌‌ను రైతులు,  పార్టీ శ్రేణులు విక్షించేందుకు  నియోజకవర్గ కేంద్రంలో స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ లీడర్లు తెలిపారు. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన మీటింగ్‌‌లో జహీరాబాద్‌‌ పార్లమెంట్​కో కన్వీనర్ కాసర్ల శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటురి శ్రీకాంత్, జిల్లా వైస్​ ప్రెసిడెంట్ భరత్ మాట్లాడుతూ  శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రోగ్రామ్‌‌ లైవ్ వస్తుందన్నారు. కౌన్సిలర్లు రవి,  ప్రవీణ్‌‌ పాల్గొన్నారు.

అబుల్ కలాంకు ఘన నివాళి

స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీలు, మైనార్టీ సంఘాల ఆఫీసుల్లో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగ అభివృద్ధికి అబుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. కలాం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. – వెలుగు, నెట్‌‌వర్క్‌‌ 

నేడు రాష్ట్ర స్థాయి క్రీడల ఫైనల్

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌‌‌‌ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్‌‌లో మూడు రోజుల కింద ప్రారంభమైన సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలు శనివారం ముగుస్తాయని ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి, ఓవరాల్ ఇన్‌‌చార్జి నీరజారెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగి పోటీలను మాహోర్ యూనివర్సిటీ అసిస్టెంట్​ ప్రొఫెసర్ దినేశ్‌‌ హాజరై ప్రారంభించారు. అనంతరం అథ్లెటిక్స్‌‌లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్సీవో యేసు పాదం, ఏఆర్సీవో రాజేంద్రప్రసాద్, డీసీవో కృతమూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉదయ భాస్కర్, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.

డబుల్‌‌ ‌‌బెడ్‌‌ ‌‌రూం ఇండ్లు ఓ వరం

వర్ని, వెలుగు: నిరుపేదలకు డబుల్‌‌ ‌‌బెడ్‌‌ ‌‌రూం ఇండ్లు ఒక వరమని, దేశంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని టీఆర్‌‌‌‌ఎస్‌‌ నియోజకవర్గ నేత పోచారం సురేందర్‌‌‌‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని ఎస్‌‌‌‌ఎన్‌‌ ‌‌పురంలో డబుల్‌‌ ‌‌బెడ్‌‌‌‌ రూం ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో మంది నిరుపేదలు ఇండ్లులేక ఎన్నో అవస్థలు పడుతున్నారని సీఎం కేసీఆర్‌‌‌‌ రాష్ట్రంలో డబుల్‌‌ ‌‌బెడ్‌‌ ‌‌రూం ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం జడ్పీహెచ్‌‌‌‌సీలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించారు.