వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం విఫలం

వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం విఫలం

కరీంనగర్: వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఆదివారం జిల్లాలోని గంగాధర మండలం గోపాలరావుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి వినోద్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం చేతకాక చేతులెత్తేస్తే... తమ ప్రభుత్వం ఆ బాధ్యతను భుజాలకెత్తుకుందన్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై వందల కోట్ల అదనపు భారం పడుతుందని, అయిన సీఎం కేసీఆర్ రైతులకు నష్టం కలిగించొద్దనే ఉద్ధేశ్యంతో ఈ చొరవ తీసుకున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సత్తా ఉంటే తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేయాలని సవాలు విసిరారు. తెలంగాణలో వరికి రూ.1960 మద్ధతు ధర ఇస్తున్నామన్న  వినోద్... రేవంత్ కు దమ్ముంటే చత్తీస్గఢ్ లో వరికి మద్దతు ధర ఇప్పించాలని సవాలు చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

పీకే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు

కోవిడ్ కట్టడికి చర్యలు

క్రికెట్ దిగ్గజం సచిన్ కు ప్రముఖుల బర్త్ డే విషెస్