అదనపు తరగతి గదుల బిల్లులు చెల్లించలేదని స్కూల్‌కు తాళం వేసిన టీఆర్ఎస్ లీడర్
నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ టౌన్‌లోని ప్రైమరీ స్కూల్లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్గురువారం స్కూల్‌కు తాళం వేశాడు. 2018-–19 సంవత్సరంలో ప్రైమరీ స్కూల్లో నాలుగు అదనపు తరగతి గదులు, హైస్కూల్లో గర్ల్స్, బాయ్స్ కు లాట్రిన్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. దీంతో నెక్కొండ టౌన్ కు చెందిన వార్డుమెంబర్, టీఆర్ఎస్పార్టీకి చెందిన తోట సాంబయ్య ఆ పనులు పూర్తి చేశాడు. ఇందులో కేవలం రూ.5 లక్షలు రిలీజ్ చేసి మిగతా బిల్లులు పెండింగ్పెట్టారు. అప్పులు ఇచ్చినవారు ఇంటి చుట్టూ తిరుగుతుండడం, రోజురోజుకు వడ్డీలు పెరుగుతుండడంతో సాంబయ్య స్కూల్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకంతో జీపీ ఎన్నికలపుడు 39 జీపీలలో వృద్ధులు ఓటు వేయడం కోసం ర్యాంపులు నిర్మించానని, నేటికీ బిల్లులు రాలేదన్నారు. ఇకనైనా పెండింగ్ బకాయిలు ఇప్పించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.