ఖమ్మం జిల్లాలో దళితుడిని TRS నేత బూతులతో దూషించిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామానికి చెందిన సురేష్... జీళ్ళచెర్వు గ్రామ పంచాయతీ నిధులపై RTI ద్వారా సమాచారం కోరాడు. తనకు సమాచారం ఎప్పుడిస్తారని సర్పంచ్ ను ఫోన్ లో అడగటంతో ఆమె భర్త ZPTC, DCCB డైరెక్టర్ శేఖర్ ఫోన్ తీసుకుని సురేష్ ను బూతులు తిట్టాడు.
CIకి ఫోన్ చేసి సురేష్ ను లోపల వేయాలంటూ హుకుం జారీ చేశాడు. దానికి సీఐ కూడా ఓకే ఓకే అంటూ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత కూసుమంచి పోలీస్ స్టేషన్ నుంచి సురేష్ ను స్టేషన్ కు రావాలంటూ కబురు వచ్చింది. గ్రామాల్లో నిధుల వినియోగంపై సమాచారం కోరితే అక్రమ కేసులు పెడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.