ZP పదవుల కోసం టీఆర్ఎస్ నేతల లాబీయింగ్

ZP పదవుల కోసం టీఆర్ఎస్ నేతల లాబీయింగ్

జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావడం,వాటికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగ నుం డటంతో టీఆర్ఎస్ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. తమవాళ్లకు ఆ పదవులను ఇప్పించుకునేందుకు మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. భార్య, కొడుకు, కోడళ్లకు పదవులు కట్టబెట్టాలని లాబీయింగ్‌ చేస్తున్నారు.ముందుగా జడ్పీటీసీ టికెట్లు దక్కించుకొని.. అదే దారిలో జడ్పీ చైర్మన్ పదవిని కూడా ఖరారు చేసుకోవాలని యోచిస్తున్నారు. తమవారికి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ వారు టీఆర్ఎస్ ముఖ్య నేతల దృష్టికి తెస్తున్నారు.

ఎవరికి వారే..

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రులు మహేందర్ రెడ్డి, అజ్మీరా చందూలాల్‌ వారసులను రంగంలోకి దించేందుకు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు,పార్టీ నేతలు సైతం తమ వాళ్లకు అవకాశాలు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరైతే తమకుతాముగా పదవులు కోరకుండా కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారనే వాదనను ముందుకు తెస్తున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడు భాస్కర్ రెడ్డికి నిజామాబాద్‌ జడ్పీ పీఠం ఇప్పించేందుకు పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. కామారెడ్డి జడ్పీబీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో జనరల్‌ అయిన నిజామాబాద్ పై పోచారం దృష్టి పెట్టినట్టు స్థానికనేతలు అనుకుంటున్నారు.

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి ఈ పదవిని ఇప్పించేం దుకుమరో కీలక నేత ప్రయత్నిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిర్మల్‌ జడ్పీ చైర్మన్‌ పదవి తన కోడలు దివ్యారెడ్డికి దక్కేలా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రయత్ని స్తున్నట్టు గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఇదే డిమాం డ్ను ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు ముందుకు తీసుకువస్తున్నారు. అయితే.. బీజేపీ నుంచి కొన్ని రోజులక్రితం టీఆర్‌ఎస్ లో చేరిన స్వర్ణ ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్‌ – మల్కాజ్ గిరి జడ్పీ చైర్మన్‌ పదవిని తన కోడలుకు ఇప్పించుకునేందుకు మంత్రిమల్లారెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. కేవలం నాలుగే జడ్పీటీసీలున్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోవడం సులువే. అయితే.. ఇక్కడి నుంచి తమ కుటుం బ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చింతల కనకారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

అక్కడ కాకపోతే మరో చోట

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన కూతురుకావ్యకు వరంగల్‌ అర్బన్‌ లేదా జనగామ జడ్పీ చైర్మన్లలో ఏదో ఒక పదవి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది.వరంగల్ అర్బన్‌ జడ్పీ పీఠం ఎస్సీ జనరల్ కు రిజర్వుడ్‌ కాగా, కడియం గతంలో ప్రాతినిథ్యం వహించిన స్టేషన్‌ ఘన్ పూర్‌ జనగామ జిల్లా పరిధిలో ఉంది.జనగామ జడ్పీ చైర్మన్‌ పదవి జనరల్ కు కేటాయించడంతో ఏదో ఒక స్థానాన్ని ఇవ్వాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తన సతీమణి, ప్రస్తుత రంగారెడ్డి జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతకు వికారాబాద్‌, రంగారెడ్డి జడ్పీల్లో ఏదో ఒకటి దక్కేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.రెండు జిల్లా పరిషత్​ పదవులు జనరల్‌ మహిళకే కేటాయించడంతో ఎక్కడో ఒక చోట అవకాశం దక్కుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ తన కుమారుడు ప్రహ్లాద్ కుములుగు జడ్పీ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ములుగు జడ్పీ చైర్మన్‌ పదవి జనరల్ కురిజర్వ్‌ కావడంతో జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ప్రహ్లాద్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన భార్యకు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ పదవి దక్కేలా ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తన భార్యకు సంగారెడ్డి జెడ్పీ పదవి ఇప్పించేందుకు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కోడలు సునరితా రెడ్డికి రంగారెడ్డి జడ్పీపదవిని ఇప్పించేందుకు ప్రయత్ని స్తున్నట్లు గులాబీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. సునరితారెడ్డి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కార్పొరే టర్గా  ఉన్నారు. ఇక, సిరిసిల్ల జడ్పీ పదవిని తన భార్యకు ఇప్పించుకునేం దుకు సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు ప్రయత్నిస్తున్నారు.సీఎం కేసీఆర్ కు ఈయన బంధువు. టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్ రావు కూడా తన కోడలికి పదవి ఇప్పించుకునేందుకు లాబీయింగ్‌ మొదలుపెట్టినట్లు రాజకీయవర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.