నకిలీ పట్టాలతో టీఆర్ఎస్ లీడర్ల భూదందా!

  • బెల్లంపల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా
  • యథేచ్ఛగా అమ్ముకుంటున్న టీఆర్ఎస్ లీడర్
  •  సర్వే నంబర్ లేకుండా ఒకే ఇంటి నంబరుపై రిజిస్ర్టే షన్లు
  • గులాబీ లీడర్లు, సర్కారు ఆఫీసర్లకు సైతం ప్లాట్లు
  • కేసు కోర్టు పరిధిలో ఉన్నా.. కొనసాగుతున్న కట్టడాలు
  •  ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్ ను కూల్చివేసిన రెవెన్యూ ఆఫీసర్

అధికారం మనదైతే అక్రమాలకు అడ్డేముంటుంది అన్నట్టు సాగుతోంది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూదందా. రూలింగ్ పార్టీకి చెందిన ఒక లీడర్ టౌన్లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఐదెకరాల గవర్నమెంట్ ల్యాం డ్ ను నకిలీ పట్టాపాస్ బుక్ తో  కబ్జాచేసి అమ్మేస్తున్నాడు. గత ఐదేళ్లుగా ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికే మూడెకరాల వరకు అమ్ము కోగా మిగిలిన స్థలానైనా కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సింగ రేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఉన్న 170 సర్వే నంబరులోని ఐదెకరాల పీపీ ల్యాండ్ గతంలో సింగరేణి సంస్థ ఆధీనంలో ఉండేది. బెల్లం పల్లిప్రాంతంలో మైన్స్ క్లోజ్ కావడం వల్ల మైనింగ్ కార్యకలాపాలు తగ్గిపోయాయి. 2016–17లో సింగరేణి ఆఫీసర్లు లీజు ల్యాండ్స్ను గవర్నమెంట్ కు హ్యాండోవర్ చేశారు. అంతకుముందు నుంచే ఖాళీగా ఉన్న విలువైన ల్యాం డ్పై టీఆర్ఎస్కు చెందిన ఒక లీడర్ కన్నేశాడు. చెట్లు, పిచ్చిమొక్క లతో నిండి ఉన్నల్యాండ్లో తాపకు కొంత చదును చేసి అమ్మడం మొదలు పెట్టాడు. సింగరేణి సంస్థ ఈ ల్యాండ్ను గవర్నమెంట్ కు అప్పగించిన తర్వాత రెవెన్యూ ఆఫీసర్లు దానిని స్వాధీనం చేసుకునేందుకు ట్రై చేశారు. దీంతో సదరు లీడర్ ఆ ల్యాండ్ తమదేనంటూ కోర్టుకు వెళ్లాడు.

నకిలీ పట్టా పాస్ బుక్ తో కోర్టుకు…

బు ధాకలాన్ రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఈ భూమికి పట్టాఉందని 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో కోర్టు ఇంటెరిమ్ ఆర్డర్స్  జారీ చేసింది. అయితే పట్టావివరాలు, రెవెన్యూ రికార్డులకు తేడా ఉన్నందున అది నకిలీ పట్టాగా ఆఫీసర్లు పేర్కొంటున్నారు. 2012లో అప్పటి బెల్లంపల్లి తహసీల్దార్గా ఉన్న విశ్వంభర్, వీఆర్వో ఎం.వెం కట్రావు సంతకాలను ఫోర్జరీ  చేసి నకిలీ పట్టాపాస్ బుక్ సృష్టించినట్లు వారు ధ్రువీకరించారు. దీనికి తప్పుడు పట్టా/ఖాతా నంబరు పేర్కొన్నాడు. కానీ ఈ నంబరు పట్టా/ఖాతాపై మరొకరికి వ్యవసాయ భూమి ఉన్నట్లు ఆఫీసర్లు తేల్చారు. నకిలీ పట్టా విషయంలో యాక్షన్ తీసుకోవాలని కోరుతూ విశ్వంభర్, వెంకట్రావు 2017 డిసెంబర్ 11న కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, తహసీల్దార్, సీఐ, ఎస్సైలకు లెటర్ రాశారు.

 యథేచ్ఛగా ప్లాట్ల అమ్మకాలు..

హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ పెండింగ్ ఉన్నప్ప టికీ సదరు ల్యాండ్లో యథేచ్ఛగా ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నాడు. గుంటకు రూ.50వేల నుంచి మొదలై ప్రస్తుతం రూ.5లక్షల నుంచి రూ.10లక్ష లకు చేరింది. టౌన్లో పట్టాల్యాండ్ లేకపోవడం, తక్కువ రేటుకు రావడం వల్లఒకరిని చూసి ఒకరు కొనుగోలు చేస్తున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ అను కూలంగా వస్తుందని, తర్వాత రిజిస్ర్టే షన్లు, పట్టాలు చేసిస్తామని చెప్పడంతో చాలా మంది నమ్ముతున్నా రు. సర్వేనంబరు లేకుండానే ఒకే హౌస్నంబరుపై బై నంబర్లు వేస్తూ పలువురికి రిజిస్ర్టే షన్లు చేయడం గమనార్హం. అక్రమ దందాకు అడ్డొచ్చిన పొలిటికల్ లీడర్లు, మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లకు అగ్గువకే పాట్లు అమ్మడంతో ఎవరూ నోరుమెదపడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది బిల్డింగులు కట్టి మున్సిపల్ ఆఫీసర్లను  మేనేజ్ చేసి హౌస్నంబర్లుపొందారు. గతంలో తక్కువ రేటుకు అమ్మి ప్రస్తుతంఖాళీగా ఉన్నప్లాట్లను మళ్లీ అమ్మకానికి పెట్టిన ఉదంతాలు సైతం ఉన్నట్లు తెలిసింది..