ఐకేపీ వడ్ల సెంటర్లపై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల పెత్తనం!

ఐకేపీ వడ్ల సెంటర్లపై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల పెత్తనం!
  • సభ్యుల తీర్మానం పట్టించుకోకుండానే సెంటర్లు ఓపెన్  
  • అధికారులు, సంఘం బాధ్యులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు
  • ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఉన్నచోట సెంటర్లు తెరవట్లే

గద్వాల, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలపై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రజాప్రతినిధులు, నాయకులు రాజకీయం చేస్తున్నారు. మహిళా సంఘాలకు కేటాయించిన సెంటర్లపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పేరుకు ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నా.. వెనుక నుంచి లీడర్లే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం వచ్చే కమీషన్‌‌‌‌తో పాటు  రైతులను తరుగు పేరిట దోపీడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  కొనుగోళ్లు కంప్లీట్ అయ్యాక ఐకేపీ అధికారులతో పాటు సంఘం నేతలకు కమీషన్‌‌‌‌లో నుంచి కొంత ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని తెలిసింది. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్నా వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్‌‌‌‌ సప్లై, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదని రైతులు వాపోతున్నారు. 

జిల్లాలో 74 సెంటర్లు ఏర్పాటు 

వానాకాలం సీజన్‌‌‌‌లో రైతులు పండించిన వడ్లను కొనేందుకు గద్వాల జిల్లాలో అధికారులు 74 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో  మహిళా సంఘాల సభ్యుల కోసం 45 సెంటర్లను కేటాయించారు. అర్బన్ ఏరియాలో మెప్మా ఆధ్వర్యంలో మూడు, మిగతా సెంటర్లు ఐకేపీ ఆధ్వర్యంలో నడపాలని గైడ్‌‌‌‌లైన్స్ ఇచ్చారు. ఇంత వరకు బాగానే అనేక సెంటర్లను  మహిళా సంఘాల ముసుగులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లు నడుపుతున్నట్లు తెలిసింది.  అధికారులను మేనేజ్‌‌‌‌ చేసి.. తూకం, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.  బస్తాకు రెండు కేజీల తరుగు తీయాల్సి ఉండగా ఆరు కేజీల వరకు తీస్తున్నారని వాపోతున్నారు. 

తీర్మానం పట్టించుకోకుండానే..

నవంబర్ 25న గద్వాల మండలం మదనపల్లె మహిళా సంఘాల కమిటీ మీటింగ్ నిర్వహించారు.  మొత్తం 11 సంఘాలు ఉండగా రెండు సంఘాలు యాక్టివ్‌‌‌‌లో లేవు. మిగతా 9 సంఘాల్లో ఈ సీజన్‌‌‌‌లో రెండు సంఘాల సభ్యులు కలిసి సెంటర్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవాలని తీర్మానం చేశారు.  కానీ,  గ్రామానికి చెందిన టీఆర్ఎస్ లీడర్లు మహిళా సంఘాల సభ్యులు లేకుండానే  వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో గ్రామ మహిళా సంఘాల  సభ్యులు నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌‌‌‌‌‌‌‌, డీఆర్డీఏ పీడీకి కంప్లైంట్ చేశారు. ఒక్క మదనపల్లెలోనే కాదు.. దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. 

ధరూర్‌‌‌‌‌‌‌‌లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధి ఉన్నాడని సెంటర్‌‌‌‌‌‌‌‌ పెట్టలే

గద్వాల జిల్లాలో మొత్తం 11 పీఏసీఎస్‌‌‌‌లు ఉన్నాయి. గద్వాల మండలం పీఏసీఎస్‌‌‌‌ తమకు కొనుగోలు కేంద్రాలు వద్దని చెప్పగా.. అధికార పార్టీ చైర్మన్లు ఉన్న 9  పీఏసీఎస్‌‌‌‌లలో  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధరూర్ మండలంలో ప్రతిపక్షాలకు చెందిన పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఉండడంతో సెంటర్‌‌‌‌‌‌‌‌ కేటాయించలేదు.  రెండేళ్లుగా ఇలాగే చేస్తున్నారని, తాము సెంటర్‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తామని కలెక్టర్‌‌‌‌‌‌‌‌, డీసీవోను కోరినా పట్టించుకోవడంలేదని వారు వాపోయారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు దౌర్జన్యం చేస్తున్నరు

మా ఊర్ల 9  మహిళా సంఘాలు ఉండగా రెండు సంఘాలు కొనుగోలు కేంద్రం పెట్టుకోవాలని తీర్మానం చేసినం. అయినా పట్టించుకోకుండా, తమకు సమాచారం కూడా ఇవ్వకుండా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు దౌర్జన్యంగా సెంటర్‌‌‌‌ ఓపెన్ చేసిన్రు.  దీనిపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు కంప్లైంట్ చేసినం. – వెంకటమ్మ,  గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు మదనపల్లె

ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటం

మదనాపల్లి మహిళా సంఘాల తీర్మానం పట్టించుకోకుండా కొనుగోలు సెంటరు ఏర్పాటు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై అడిషనల్ డీఆర్‌‌‌‌‌‌‌‌డీఏతో ఎంక్వైరీ చేయిస్తున్నం. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటం.  ధరూర్ మండల పీఏసీఎస్‌‌‌‌ వ్యవహారం మా దృష్టికి రాలేదు. –నాగేంద్రం, డీఆర్డీఏ పీడీ గద్వాల