కారు దిగేసి.. కాంగ్రెస్ లోకి!

కారు దిగేసి.. కాంగ్రెస్ లోకి!

మొన్నటివరకు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు,ముఖ్య నేతలు.. టీఆర్​ఎస్ లోకి క్యూ కట్టారు.పరిషత్​ ఎన్నికల వేళ సీన్​ రివర్స్​ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనుకునే స్థానిక నేతలు టీఆర్​ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిషత్ షెడ్యూల్​ రావడంతో త్వరలో తమ పార్టీలోకి వలసలు మొదలవుతాయని కాంగ్రెస్ నమ్ముతోంది.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌‌‌‌, ఓదెల, రామగుండం మండలాల నేతలు కాంగ్రెస్‌ లోకి వస్తామంటూ స్థానిక డీసీసీ అధ్యక్షుడిని కోరినట్లు ప్రచారంలో ఉంది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, మేడిపల్లి మండలాల నేతలు.. హుస్నాబాద్‌‌‌‌ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, సైదాపూర్‌‌‌‌, హుస్నాబాద్‌‌‌‌ మండలాలకు చెందిన కొందరునేతలు కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్‌‌‌‌, వెల్దండ, కల్వకుర్తి నేతలు సైతం హస్తంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి నేతలు కూడా కాంగ్రెస్‌తో టచ్‌ లో ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు పలు మండలాలనేతలు టికెట్‌ ఇస్తే కాంగ్రెస్‌ లో చేరేందుకు రెడీ అని సమాచామిస్తున్నట్టుగా తెలిసింది.

టీఆర్ఎస్కుఓవర్ఫ్లోఎఫెక్ట్​
తెలంగాణ ఆవిర్భావానికి ముందు నుంచి పనిచేసిన వారితోపాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక నేతలు టీఆర్​ఎస్ లో భారీగా చేరారు. పాత నేతలతోపాటు కొత్తగా వచ్చిన నేతలు ఇప్పుడు టీఆర్​ఎస్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లను ఆశిస్తున్నారు. పరిషత్​ టికెట్లు దక్కుతాయన్న హామీతో తాము వలస వచ్చామని, ఎలాగైనా అవకాశం ఇవ్వాల్సిందేనని కొత్త నేతలు పట్టుపడుతున్నారు. వారి వల్ల తమ రాజకీయ ఉనికికే ప్రమాదమని పలువురు పాత నేతలు భావిస్తున్నారు. పార్టీమారైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కరువులో కాంగ్రెస్ కు ఊరట!
కాంగ్రెస్ కు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మినహాయిస్తే మరే జిల్లాల్లోనూ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు దొరకని పరిస్థితి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరడంతో ఆ పార్టీలో ఈ పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కొంత మేరకు క్యాండిడేట్లు ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో పోటీ చేసే వారే కనిపించడం లేదు. మిగతా జిల్లాల్లో సగానికి పైగా మండలాలకు జడ్పీటీసీ క్యాండిడేట్లను వెతుక్కోవాల్సి వస్తుంది. టీఆర్‌ఎస్‌‌‌‌ అభ్యర్థిత్వాలు ఎవరికిదక్కే అవకాశముందో ఇప్పటికే లీకులు అందుతుండటంతో టికెట్‌‌‌‌ రాదని నిర్ణయానికి వచ్చిన నేతలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలను, డీసీసీ అధ్యక్షులను సంప్రదిస్తున్నారు. తమకు సొంతంగా బలం, బలగం ఉన్నదని, కాంగ్రెస్‌‌‌‌ టికెట్‌‌‌‌ ఇస్తే గెలిచి వస్తామని చెప్తున్నారు. ఈ విషయాన్ని పలువురు డీసీసీ అధ్యక్షులు పార్టీ రాష్ట్రనాయకత్వం దృష్టికి తీసుకురాగా, నియోజకవర్గ ఇన్‌ చార్జీతో సమన్వయం చేసుకొని నిర్ణయంతీసుకోవాలని పీసీసీ పెద్దలు సూచించారు.

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హవాలోనూ ఎందుకు?
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌‌‌‌కు ప్రజలు భారీ విజయాన్ని అందించారు. అదే ఊపు పంచాయతీ ఎన్నికల్లోనూ కనిపించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వస్తాయని గులాబీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక నేతలు అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌‌‌‌ వైపు చూడటంపై గ్రామ, మండల స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పరిషత్​ ఎన్నికలు పూర్తిగా వ్యక్తి  కేంద్రంగానే జరుగుతాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుకన్నా క్యాండిడేట్‌‌‌‌ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. బలమైనక్యాండిడేట్‌‌‌‌కు పార్టీ గుర్తు ఉంటే విజయం సునాయాసమవుతుంది. అధికార పార్టీలో టికెట్‌‌‌‌ రాదని నిర్ణయించుకున్న నేతలు ఇప్పుడు పోటీచేయకుంటే తమ ఉనికే ప్రశ్నార్థక మవుతుందనిలెక్కలు వేసుకుంటున్నారు.

వాళ్లను రుద్దుతారేమోనని..
టీఆర్‌ఎస్‌‌‌‌లో స్థానిక నాయకులే టికెట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి. జడ్పీ చైర్మన్‌ పీఠాలు ఆశిస్తున్నసీనియర్‌ నేతలు కొందరు పొరుగు మండలాల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది స్థానిక నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. పక్క మండలాల నేతలను తమపై రుద్దొద్దు అంటూ ఎంపీలు, ఎమ్మెల్యే లకు తేల్చి చెప్తున్నారు. తమను కాదని పోటీ చేయిస్తే పార్టీ మారడానికి సిద్ధమని స్పష్టంచేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌ ఎస్సీజనరల్‌ కు రిజర్వ్‌‌‌‌కాగా ఎల్కతుర్తి జెడ్పీటీసీ ఎస్సీ(జనరల్‌ ), హసన్‌ పర్తి జెడ్పీటీసీ ఎస్సీ (మహిళ)కు రిజర్వ్‌‌‌‌ చేశారు. ఈ రెండు స్థానాల్లో స్థానికులు కాకుండా పొరుగు మండలాలకు చెందిననేతలను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌ జడ్పీ చైర్మన్‌ పదవి ఎస్సీ (మహిళ) రిజర్వ్‌‌‌‌ కాగా హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గం లోని ఇల్లందకుంట, చొప్పదండి జడ్పీటీసీ స్థానాల్లో పోటీకి వలస నేతల పేర్లే ముందు వరుసలో ఉన్నాయి.వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దని స్థానిక నేతలు బలంగా కోరుతున్నారు. ఇతర జిల్లాల్లోనూ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న నేతలు సొంత మండలాల్లో రిజర్వేషన్లు అనుకూలించక పొరుగు మండలాలకు వలసవెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన నేతల వారసులు పోటీ చేస్తున్న స్థానాలుమినహా మిగతా అన్ని చోట్ల వలస నేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.