
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్తు సర్వ సభ్య సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు ‘దళితబంధు’పై కీలక వ్యాఖ్యలు చేశారు. దళితబంధులో భాగంగా ఇస్తున్న గేదెలు, ఆవుల కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. స్థానికంగా అందుబాటులో ఉన్న గేదెలు, ఆవులను కొని.. లబ్దిదారులకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండడం లేదన్నారు.
ఇతర ప్రాంతంలో రూ.70 వేలు విలువ చేసే గేదె స్థానికంగా రూ.50 వేలకే అందుబాటులో ఉన్నప్పటికీ కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మిగతా 20 వేల రూపాయలు ఎక్కడకు, ఎవరికి పోతున్నాయో తెలిసిన విషయమే అంటూ కామెంట్స్ చేశారు.