రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధించారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం రూల్స్ మాకు వర్తించవంటూ బ్రేక్ చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవనేని కృష్ణారావు ఈ ఉల్లంఘనకు పాల్పడ్డారు. బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఆయనతో పాటు 100 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ దృష్ట్యా ఎటువంటి ఫంక్షన్లు చేయొద్దని పోలీసులు ఆర్డర్స్ జారీ చేశారు. ఒక వేళ ఏవైనా ఫంక్షన్లు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే పరిమిత సంఖ్యలో మాత్రమే పాల్గొనాలని నిబంధనలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా.. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే లాక్‌డౌన్ మొదటిరోజునే వేడుకలలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.