జర్మనీ పాస్‌‌‌‌పోర్టుతోనే చెన్నమనేని ప్రయాణం

హైదరాబాద్, వెలుగు: టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌‌‌‌కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్రం బుధవారం హైకోర్టుకు మరోసారి తెలిపింది. జర్మనీ పాస్‌‌‌‌పోర్టుతోనే ఇప్పటికీ ఆయన ప్రయాణం చేస్తున్నారని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ రాజేశ్వర్‌‌‌‌రావు కోర్టుకు తెలిపారు. చెన్నమనేని తరఫు న్యాయవాది వై.రామారావు అభ్యంతరం చెప్పగా, కేసు విచారణను వాయిదా వేయాలని రాష్ట్రం తరఫున అడిషనల్‌‌‌‌ అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోర్టును కోరారు. దీనికి పిటిషనర్​ ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న జడ్జి జస్టిస్‌‌‌‌ విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి విచారణను జనవరి 3కు వాయిదా వేశారు.