వీడియో: తానో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని మరచి.. కాంగ్రెస్ పేరు పలికిన ఎమ్మెల్యే

వీడియో: తానో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని మరచి.. కాంగ్రెస్ పేరు పలికిన ఎమ్మెల్యే

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో ఎవరికీ తెలియదు. ఒకపార్టీ నుంచి మరో పార్టీకి మారినప్పుడు.. మాటల్లో పాతపార్టీని పలకడం అలవాటులో పొరపాటు. తాజాగా అటువంటి ఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మండలంలోని దాచాపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు అంటూ.. సీసీ రోడ్లు ప్రారంభించిన గ్రామం పేరు కూడా తప్పు చెప్పారు. దాంతో పక్కనే ఉన్న నాయకులు, అధికారులు వెంటనే ఎమ్మెల్యేను అలర్ట్ చేయడంతో తన తప్పును సరిదిద్దుకున్నారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పనిచేయడం వల్ల ఇంకా ఆ పార్టీ పేరే వస్తుందని ఆయన అన్నారు. తానొక టీఆర్ఎస్ ఎమ్మెల్యేననే విషయాన్ని మరచి కాంగ్రెస్ పార్టీ నాయకుడిలా మాట్లాడటంపై పక్కనున్న నాయకులు, అధికారులు అవాక్కయ్యారు. నియోజకవర్గంలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

For More News..

మంగళసూత్రాన్ని కుక్క గొలుసుతో పోల్చిన లేడీ ప్రొఫెసర్

నూట రెండేళ్ల మాష్టారు.. 70 ఏళ్లుగా పాఠాలు చెప్తున్న నందా సర్

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..