యాత్ర పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు

వరంగల్: బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రమా యాత్ర కాదని.. అది తెలంగాణ విద్రోహ యాత్ర అని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. యాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. దేశ నేతగా కేసీఆర్ కు వస్తున్న గుర్తింపును చూసి ఓర్వలేక బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్ తో యాత్ర చేయిస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను దమ్ముంటే పాతయాత్రలో ప్రజలకు వివరించాలని సవాలు విసిరారు. ములుగులోని గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.రైతుల కోసం రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంటే... తమ పోరాటం వల్లే కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చారని బండి సంజయ్, రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 
 

మరిన్ని వార్తల కోసం...

చైనాకు రాజ్నాథ్ వార్నింగ్ !

108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ