కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోంది

కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోంది

న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోందని, వడ్ల కొనుగోళ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆధ్యర్యంలో ‘వరి దీక్ష’ను చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత దీక్ష స్థలాన్ని సందర్శించి... ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... యాసంగి వడ్లను కొనకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను రోడ్డు మీదికి ఈడ్చిందని, ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల  కోసం టీఆర్ ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.  ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమం జరగనుందని, దీనికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.

కాగా..ఈనెల 11న టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన  ‘వరి దీక్ష’కు ఢిల్లీ వేదిక కానుంది. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలనే డిమాండ్ తో ఈ నిరసన కార్యక్రమానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకు వరి దీక్షలో పాల్గొంటారని టీఆర్ఎస్ ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం...

స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడుతున్రు

పదేండ్ల V6 జర్నీ