ధరణి పోర్టల్పై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫ్రస్టేషన్కు గురై కేసీఆర్ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఈటల బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర అని.. ఆయన అవినీతిపరుడు కాబట్టే కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిపై రెండు నెలల క్రితమే సవాల్ విసిరితే ముఖం చాటేశారని మండిపడ్డారు.
ఈటల రాజేందర్ ఓట్లు వేసి గెలిపించిన గ్రామాలలో ఎందుకు తిరగట్లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధిని ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికే ప్రజాదర్బార్ నిర్వహించినట్లు చెప్పారు. గ్రామంలో ఎక్కువ మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు