రాష్ట్రంపై విషం కక్కిన ప్రధాని మోడీ

హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని మోడీ విషం కక్కారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న మోడీ... కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ అయిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రధాని హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు ఆడారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేటాయించిన ఐటీఐఆర్ను రద్దు చేసిన చరిత్ర మోడీది కాదా అని నిప్పులు చెరిగారు. 

మరిన్ని వార్తల కోసం...

ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సెనా ప్రమాణం

మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ