కేంద్రం నిధులతో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం : ఎంపీ కవిత

జగిత్యాల జిల్లా : కోరుట్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిజామాబాద్ టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి కవిత. పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారామె. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం కాబట్టే… పరిశ్రమలు పెట్టేందుకు ఇతర దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.

తెలంగాణ ఏర్పడిన ఐదేళ్లకే కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం రాబోతోందని చెప్పారు కవిత. 16 స్థానాలకు 16 గెలిస్తే మరింత కేంద్రం నిధులు తెప్పించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గ్రాఫ్.. రోజు రోజుకు తగ్గిపోతోందన్నారు. రాహుల్ గాంధీకి కూడా అవకాశం కనిపించడం లేదన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని చెప్పారు కవిత.