రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

పార్లమెంట్ ఉభయ సభల్లో  టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేపట్టారు.  ధాన్యం కొనుగోళ్లపై లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. స్పీకర్ తిరస్కరించడంతో  లోక్ సభలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు ఎంపీలు. ధాన్యం కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు అమాయకులని... కేంద్ర విధానాలతో వారు ఇబ్బందులు పడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ్యసభలో  ధాన్యం కొనుగోళ్ల తీర్మానంపై చర్చకు అనుమతించకపోవడంతో రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్