
రంగారెడ్డి జిల్లా , వెలుగు: జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వినూత్న సంఘటనలు కనిపిస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు టీఆర్‌ఎస్ ప్రత్యర్థులుగా వ్యవహరించిన నాయకులే పార్టీ ప్రతినిధులుగా పోటీకి సిద్ధమయ్యారు . టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు, విమర్శలు చేసిన క్షేత్రస్థాయి నాయకులకు నేడు ఆ పార్టీ నుంచే స్థా నిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. 21 జడ్పీటీసీ 21ఎంపీపీ స్థానాలకు ఆర్థిక బలం అంగ బలం ఉన్న నేతలనే టీఆర్‌ఎస్ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగానే కాం గ్రెస్, టీడీపీలో ఎన్నో ఎళ్లుగా క్రియాశీలకంగా పనిచేసిన నాయకులను స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయించేందుకు ప్రణాళికలు రూపొందించింది. బలమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్ని కల్లో పోటీచేయిస్తున్నారు . దీంతో ఎన్నో ఎళ్లుగా పార్టీ కోసంపనిచేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోంది. నిన్న, మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ను,కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టమొచ్చినట్లు తిట్టిన నాయకులు టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు .
స్థానిక సంస్థలకు దూరం..
ఇబ్రహీంపట్నం , మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్యాయం జరుగుతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ ఇన్ చార్జ్ వ్యవహరించిన వంగేటి లక్ష్మారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి… మహేశ్వరం ఇన్ చార్జ్ గా వ్యవహరించిన కొత్త మనోహర్‌రెడ్డి, తీగల కృష్ణా రెడ్డి, చేవెళ్ల కే.ఎస్ తర్నం లాంటి నేతల అనుచరులు స్థానిక సంస్థలో పోటీ చేసే అవకాశం వస్తోందని ఎంతో కాలంగా ఆశిస్తున్నారు . వీరందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.అనాటి నుంచి ఇటీవల టీఆర్ఎస్ నుంచి పోటీచేసే వరకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులకే అన్ని పదవుల్లో అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో తీగల కృష్ణా రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత కొత్త మనోహర్ రెడ్డి అనుచరులకు,ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌కు అండగాఉండటంతో తీగల అనుచరులకు స్థా నిక సంస్థలఎన్ని కల్లో పోటీ చేసే అవకాశం లేకపోయిం ది.ఈవిధంగా నాయకులు పార్టీలు మారడంతోఅధికారంలో ఉన్న నేతల అనుచరులకే పదవులుదక్కుతున్నాయి. దీంతో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తులకు నష్టం జరుగుతోందని టీఆర్ఎస్ కార్యకర్తలు వాపోతున్నారు . ఇన్నాళ్లుగాటీఆర్‌ఎస్‌ను తిట్టి నాయకులకే ప్రజా ప్రతినిధులుగా అవకాశం ఇవ్వడంతో స్థానిక కార్యకర్తల్లోకలవరం మొదలైయింది.