ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖబర్దార్.. హెచ్చరించిన టీఆర్ఎస్ సర్పంచ్ భర్త

నిజామాబాద్: తన మాట వినకపోతే  ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమపై దాడులు చేయిస్తున్నాడని మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ సర్పంచ్ పావని భర్త, టీఆర్ఎస్ సీనియర్ నేత శ్యామ్ రావ్ ఆరోపించారు. జడ్పీ ఛైర్మన్‎కి అనుకూలంగా వ్యవహరిస్తున్నామనే కారణంగా.. తాను నిర్వహిస్తున్న వ్యాపారాలపై పోలీసులతో దాడులు చేయించి బెదిరిస్తున్నాడని శ్యాంరావ్ అన్నారు. జీవన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే బయట తిరగనివ్వమని.. ఆయనకు భయపడే ప్రసక్తే లేదని, ఖబడ్ధార్ అంటూ శ్యామ్ రావ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నాడని శ్యామ్ రావు ఆరోపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్యామ్ రావ్ వీడియో హాల్ చల్ చేస్తోంది.

For More News..

మునిగిన ఊరిలో సంక్రాంతి సంబురాలు

30 కోట్ల ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్ ఉన్న మొదటి మహిళ