జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తొలి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ విజయం సాధించారు. ఈ డివిజన్‌లో బీజేపీ నుంచి గంగరాజు, కాంగ్రెస్ నుంచి సత్యనారాయణ, టీడీపీ నుంచి రమేష్ కుమార్ పోటీలో ఉన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏఎస్ రావ్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీష గెలుపొందారు. ఈ డివిజన్‌లో టీఆర్ఎస్ నుంచి పావని రెడ్డి, బీజేపీ నుంచి చంద్రిక, టీడీపీ నుంచి నిర్మల పోటీలో ఉన్నారు.
ఉదయం నుంచి మందకోడిగా సాగిన ఓట్ల లెక్కింపు ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
For More News..
గ్రేటర్ వార్: తొలిరౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం