హైదరాబాద్, వెలుగు: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని, సీఎం తన కామెంట్లను వెనక్కి తీసుకుని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్టీపీ డిమాండ్ చేసింది. ఇంకోసారి కొత్త రాజ్యాంగ విషయాన్ని లేవనెత్తితే ప్రజలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో లీడర్లు రాజగోపాల్, సత్యవతి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అవహేళన చేసిన సీఎం కేసీఆర్.. ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పాలని సోమన్న డిమాండ్ చేశారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని.. కేసీఆర్‌నే అని మండిపడ్డారు. తలపొగరుతో మాట్లాడుతున్న కేసీఆర్‌కు ప్రజలే సరైన టైమ్‌లో బుద్ధి చెబుతారన్నారు. 72 ఏండ్ల దేశ చరిత్రలో ఏ ఒక్కరూ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పలేదని, అంత గొప్ప రాజ్యాంగాన్ని కేసీఆర్ లాంటి నియంత మార్చాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. మొదటి నుంచి దళితులంటే కేసీఆర్ చిన్నచూపేనని, అందుకే దళిత సీఎం, మూడెకరాల భూమి, కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదన్నారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు దళిత బంధు తెచ్చారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం దళితుల పట్ల కేసీఆర్‌కు ఉన్న వివక్ష ఏమిటో అర్థమవుతోందని సత్యవతి అన్నారు.
ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్టీపీ నిరసన
- హైదరాబాద్
- February 7, 2022
మరిన్ని వార్తలు
-
Kanguva BoxOffice: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రికార్డులు అనుకుంటే సీన్ రివర్స్.. తెలుగులో ఎంతంటే?
-
Cooking Tips : ఈ కూరగాయలను ఇలాగే వండాలి.. లేకపోతే తిన్నా వేస్ట్.. బలం ఉండదు.. !
-
హైదరాబాదీలు బీ అలర్ట్: 10వేల నకిలీ ఆధార్ అకార్డులు 15వేల నకిలీ ఓటర్ కార్డులు
-
కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
లేటెస్ట్
- Kanguva BoxOffice: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రికార్డులు అనుకుంటే సీన్ రివర్స్.. తెలుగులో ఎంతంటే?
- Cooking Tips : ఈ కూరగాయలను ఇలాగే వండాలి.. లేకపోతే తిన్నా వేస్ట్.. బలం ఉండదు.. !
- హైదరాబాదీలు బీ అలర్ట్: 10వేల నకిలీ ఆధార్ అకార్డులు 15వేల నకిలీ ఓటర్ కార్డులు
- కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
- కులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సీఎం రేవంత్
- Unstoppable: నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు లేడు.. దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్
- ఏం చేసుకుంటావో చేసుకో.. అరెస్ట్ చేస్తే చేస్కో: కేటీఆర్
- గుడ్ న్యూస్: సికింద్రాబాద్ టు లక్నో స్పెషల్ రైలు షురూ..
- Kanguva: కంగువ కోసం సూర్య, బాబీ డియోల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే.. చాలా తక్కువే?
- Success: ఎక్సర్సైజ్ ఆస్ట్రాహింద్ మూడో ఎడిషన్
Most Read News
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- Ranji Trophy 2024-25: RTM కార్డు ఇతనికే: ట్రిపుల్ సెంచరీతో దుమ్మలేపిన RCB బ్యాటర్
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల