పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి...టీఆర్టీఎఫ్ మద్దతు

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల స్థానానికి పీఆర్టీయూ అభ్యర్థి, ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పింగళి శ్రీపాల్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్,  మారెడ్డి అంజిరెడ్డిలు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి మద్దతు లేఖను అందించారు. శ్రీపాల్ రెడ్డి గెలుపు కోసం టీఆర్టీఎఫ్ శ్రేణులు కృషి చేస్తాయని వెల్లడించారు.