ట్రక్కు, టెంపో ఢీ.. 11 మంది మృతి

క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హుబ్లీ-ధార్వాడ్ బైపాస్ రహదారిపై శుక్రవారం ఉదయం ఇట్టిగట్టి వద్ద ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, టెంపో ఢీకొని 11 మంది మరణించారు. ధార్వాడ్ సిటీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇట్టిగట్టి క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మహిళా ప్రయాణికులతో సహా టెంపో డ్రైవర్ మరణించాడు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా దావంగేరేలోని ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా గోవాలో జరిగే ఒక ఫంక్షన్‌కు వెళుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో బైపాస్‌లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రమాదానికి కారణమైన వాహనాలను పోలీసులు హైవే మీద నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ హైవే సింగిల్ లేన్ కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ‘ఈ రోడ్డును వెడల్పు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. అయితే రోడ్డు కాంట్రాక్టర్ మరియు ప్రభుత్వం మధ్య ఉన్న ఒప్పందం కారణంగా 2023 తర్వాత మాత్రమే రోడ్డు వెడల్పు చేసే అవకాశముంది’ అని ఒక స్థానికుడు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

For More News..

సిగ్నల్ యాప్‌కు మారుతున్నారా? అయితే వాట్సాప్ గ్రూపులను సిగ్నల్ యాప్‌కు ఇలా మార్చుకోండి..

బయటకే సెలూన్.. లోపల మాత్రం వేరే యవ్వారం

పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే