ట్రూకాలర్ యాప్.. ఇప్పటికే దాదాపు అందరి ఫోన్స్‌లో డిఫాల్ట్‌గా ఉండే యాప్‌ల జాబితాలో చేరింది. అయితే ఇప్పుడు ట్రూకాలర్ సర్వీసు వెబ్ వెర్షన్ కూడా మొదలుపెట్టింది. ఈ ట్రూకాలర్ వెబ్ వెర్షన్ ద్వారా స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తెచ్చింది. ఇది ఇంకా ఏమేం చేస్తుంది? ఎలా చేస్తుందో వివరాలు ఇవి...
- గుర్తుతెలియని నెంబర్‌ని చెక్ చేయొచ్చు.
- టెక్స్ట్ మెసేజ్‌లు చూడవచ్చు. కంప్యూటర్ నుంచి నేరుగా అన్ని టెక్స్ట్ మెసేజ్‌లు, చాట్స్చదవొచ్చు. వాటికి రిప్లయ్ కూడా ఇవ్వొచ్చు.
- కంప్యూటర్ నుంచి నేరుగా రియల్ టైమ్ నోటిఫికేషన్‌లను రిసీవ్ చేసుకోవచ్చు.
- ట్రూకాలర్ వెబ్ యూజర్లు ఎస్సెమ్మెస్ ఇన్‌బాక్స్, ట్రూకాలర్ చాట్, బిజినెస్‌కి సంబంధించిన మెసేజ్‌లను కూడా చూడొచ్చు.
- కంప్యూటర్ కీబోర్డ్ ఆప్షన్‌తో మెసేజ్‌లు టైప్ చేయొచ్చు.100ఎంబీ వరకు మల్టీ ఫైల్స్‌ను యాడ్ చేయొచ్చు.
- ట్రూకాలర్ అత్యవసర మెసేజ్ ఫీచర్ వాడి మెసేజెస్ను ‘ఎమర్జెన్సీ’ అని మార్క్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ముఖ్యమైన మెసేజ్‌లను వెంటనే చూడొచ్చు.
- ఇన్‌కమింగ్ కాల్, మెసేజ్ అలర్ట్స్‌ను రియల్ టైమ్‌లో నేరుగా కంప్యూటర్ స్క్రీన్ మీదనే ఆపరేట్ చేయొచ్చు.
- ఈ ఫీచర్ మీరు కంప్యూటర్‌లో వేరే పని చేసుకుంటున్నా కూడా కనెక్ట్ అయి సమాచారం ఇస్తుంది.
- ఫోన్, వెబ్ బ్రౌజర్ మధ్య ఎన్‌క్రిప్టెడ్ లింక్ క్రియేట్ చేస్తుంది ట్రూకాలర్ వెబ్ ఫీచర్.
- ఈ సెటప్ చేయడం చాలా ఈజీ. యూజర్లు తమ డివైజ్‌లను వెంటనే లింక్ చేసుకోవచ్చు.
- ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్, మెసేజ్‌లకు యాక్సెస్ లేకుండా ప్రైవసీ, సెక్యూరిటీని ఇస్తుందని ట్రూకాలర్ చెప్తోంది.
ఎనేబుల్ చేయాలంటే..
ఆండ్రాయిడ్ యూజర్లు ట్రూకాలర్ యాప్‌లోని మెసేజ్ ట్యాబ్‌పై ట్యాప్ చేసి వెబ్ ట్రూకాలర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్రూకాలర్ వెబ్ మెసేజ్ సెలక్ట్ చేసుకున్నాక స్క్రీన్‌పై వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వొచ్చు. లేదా.. యూజర్లు (web.truecaller.com) వెబ్‌సైట్‌ని విజిట్ చేయొచ్చు. ఈ లింక్ ద్వారా డివైజ్‌లను ఈజీగా లింక్ చేసుకోవచ్చు.