![ట్రూ లవర్ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్](https://static.v6velugu.com/uploads/2024/02/true-lover-movie-going-to-release-on-february-10_x2RoWIhm6i.jpg)
ప్రతి రోజు పండగే, ట్యాక్సీ వాలా, బేబి చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపును అందుకున్నారు ఎస్‌కేఎన్. తాజాగా దర్శకుడు మారుతితో కలిసి తమిళ మూవీ ‘లవర్’ను ‘ట్రూ లవర్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మణికందన్, శ్రీ గౌరి ప్రియ జంటగా ప్రభురామ్ వ్యాస్ రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఎస్‌కేఎన్ మాట్లాడుతూ ‘ఒక ఫ్రెండ్ ద్వారా ఈ సినిమా మా దృష్టికి వచ్చింది.
మారుతికి, నాకు బాగా నచ్చడంతో తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నాం. ప్రేమలో ఉన్న యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. లవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు బాగా చూపించాడు. ఏ రిలేషన్‌లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది, ఉండాలి. ఇందులో మెయిన్ పాయింట్ కూడా ఇదే. ఇక ‘బేబి’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాం. త్వరలో అనౌన్స్ చేస్తాం. హిందీలో స్టార్ కిడ్స్ లేదా కొత్త వాళ్లతో ఈ రీమేక్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండతో సినిమాలు చేస్తున్నా’ అని చెప్పారు.