OTTకి ట్రూ లవర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

మాస్ మూవీ(Mass Movies) పతాకంపై ప్రముఖ దర్శకుడు మారుతి(Maruthi), నిర్మాత SKN కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్(True Lover). తమిళంలో సూపర్ హిట్ ఐన ఈ సినిమాను ప్రభురామ్ వ్యాస్(Prabhuram Vyas) తెరకెక్కించగా.. మణికందన్(Manikandan), గౌరీ ప్రియ(Gouri Priya) జంటగా నటించారు. ఇక టీజర్, ట్రైలర్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 10న థియేటర్స్ లోకి వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 

తాజాగా ట్రూ లవర్ ఓటీటీ రిలీజ్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను మార్చి మొదటివారంలో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 

ALSO READ :- ఊరు పేరు భైరవకోనకి నుంచి హరోం హర సాంగ్.. వింటే గూస్బంప్స్ గ్యారంటీ

త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే.. ఈ సినిమా తెలుగులో విడుదలై ఒక్కరోజు రోజు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వస్తుండటంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. మరి థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.