స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నకొద్దీ సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. రోజుకో కొత్త రకం మోసంతో అమాయకులను దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఐటీ ప్రొఫెషనల్స్ కూడా మోసపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఆన్ లైన్ మోసాల బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారు కూడా చాలా మంది ఉన్నారు.అయితే, ఈ ఆన్ లైన్ మోసాల నుండి బయటపడేలా ట్రూ కాలర్ ఒక కొత్త ఫీచర్ ని లంచ్ చేసింది. ఆన్ లైన్ మోసాల నుండి రక్షణగా ఇన్సూరెన్స్ సర్వీస్ ని లాంచ్ చేసింది ట్రూ కాలర్ సంస్థ.
ఈ లీడింగ్ కాలర్ ఐడీ అండ్ ఇన్స్టంట్ మెసేజింగ్ సంస్థ తమ యూజర్స్ ని ఆన్ లైన్ మోసాల నుండి రక్షించేందుకు ఇన్సూరెన్స్ ఫీచర్ ని లాంచ్.ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు వర్తిస్తుంది.ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ HDFC Ergo అనుసంధానం చేసుకున్న ట్రూ కాలర్ ఈ సర్వీస్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇండియాలో మాత్రమే పనిచేస్తుందని తెలిపింది ట్రూకాలర్.
ట్రూ కాలర్ ఇన్సూరెన్స్ ఇలా యాక్టివేట్ చేసుకోండి:
- ట్రూ కాలర్ లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- సెట్టింగ్స్ లేదా ప్రీమియం ఫీచర్స్ లో ఇన్సూరెన్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
- ఆ తర్వాత యాప్ సూచనలను ఫాలో అయితే చాలు కవరేజ్ యాక్టివేట్ అవుతుంది.
ఇన్సూరెన్స్ ఫీచర్ తో పాటుగా AI కాల్ స్కానర్ ని కూడా లాంచ్ చేసింది ట్రూకాలర్ సంస్థ.AI కాల్ స్కానర్ ద్వారా AI ఆధారిత కాల్ స్కామ్స్ ని అరికట్టే అవకాశం ఉందని తెలిపింది ట్రూకాలర్