ట్రూకాలర్ యాప్‌లో కొత్త ఫీచర్స్

ట్రూకాలర్ యాప్‌లో కొత్త ఫీచర్స్

ట్రూ కాలర్​ యాప్​ తెలియని వారుండరు. స్ట్రేంజ్​​ నెంబర్లను చెక్​ చేయడానికి ఈ యాప్​ను వాడుతుంటారు. అయితే దీంట్లో ఫ్రీ, ప్రీమియం ఫెసిలిటీస్​ ఉండేవి. ఇప్పటివరకూ ప్రీమియం యూజర్లకు మాత్రమే అవైలబుల్​గా ఉన్న ఫీచర్లు ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వాటితో పాటు కొన్ని కొత్త ఫీచర్లను కూడా ట్రూకాలర్​ యాడ్​ చేసింది.

కాలర్​ వీడియో

ఇంతకు ముందు వరకు యూజర్​ పేరు, ఈ–మెయిల్​ అడ్రస్​ మాత్రమే ​ రికార్డ్​ చేసేది ట్రూ కాలర్. కానీ ఇప్పుడు యూజర్​ తన వీడియోను కూడా ముందే రికార్డ్​ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా ఫోన్​ చేసినప్పుడు పేరుతో పాటు వీడియో కూడా అవతలి వాళ్లకు కనిపిస్తుందన్నమాట. అందుకోసం యూజర్​ తన వీడియోను ముందే రికార్డు చేసుకోవచ్చు. 

అనౌన్స్​ 

కాల్​ అనౌన్స్​ అనే ఫీచర్​ ద్వారా ఫోన్​ చేసిన వాళ్ల పేరు, వివరాలను చదివి వినిపిస్తుంది. అంటే ఫోన్​ స్క్రీన్​ చూడకుండానే ఎవరు కాల్​ చేశారో తెలుసుకోవచ్చు. 

కాల్​ రికార్డర్

ట్రూ కాలర్​లో కాల్​ రికార్డింగ్​ ఫీచర్​ ఉన్నప్పటికీ అది గతంలో ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు అది ఫీచర్​ అయింది. అంటే అందరికీ ఈ ఫీచర్​ వాడుకునే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు.. ట్రూ కాలర్​ వాడుతున్న వారు మెసేజులు, కాల్స్​ ఒకే ట్యాబ్​ నుంచి చేసుకోవడానికి వీలుండేది. కానీ కొత్త ఫీచర్​ ద్వారా ఇప్పుడు సెపరేట్​గా కాల్​ చేసుకునే వీలుంది. కాల్​ లిస్ట్​, మెసేజ్​ల లిస్ట్​ వేరువేరు ట్యాబ్స్​లో రికార్డ్​ అవుతాయి. 

ఘోస్ట్‌‌ కాల్‌‌ 

ఈ కాల్​ కొంత విచిత్రమైంది. దీన్ని ఉపయోగించి ఘోస్ట్​ కాల్స్​ చేయొచ్చు. ప్రాంక్‌‌ కాల్స్‌‌ చేయడానికి దీన్ని వాడొచ్చు. ఫోన్​ చేసినప్పుడు ఫోన్​ చేసిన వాళ్ల వివరాలు కాకుండా ఇతరుల పేరు, నెంబర్‌‌ లేదా ఫొటో కనిపించేలా మార్పులు చేయొచ్చు. ఈ ఫీచర్‌‌ ను కేవలం ప్రీమియం, గోల్డ్‌‌ సబ్‌‌ స్క్రైబర్స్‌‌కు మాత్రమే ఉపయోగించే ఛాన్స్​ ఉంది.