అసలే ఇది మాయదారి ప్రపంచం.. అన్‌నోన్ నంబర్లు ఎత్తొద్దని వ్రతం పూనినా.. తెలియని ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్నా.. సైబర్ నేరగాళ్లను తప్పించుకోలేకపోతున్నాం.. ఎంత అవాయిడ్ చేసినా కొత్త నంబర్ల నుంచి కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంటోంది. పొరపాటున ఎత్తామా.. పోలీసులమనీ, బ్యాంకు అధికారులమనీ నమ్మబలికి కాటేస్తున్నారు. చాలావరకు ఇలాంటి కాల్స్ ఎక్కువగా విదేశాల నుంచే వస్తుంటాయి. వారి మాటలను నమ్మిన వాళ్లను నట్టేట ముంచడమే ఫేక్‌కాలర్స్ లక్ష్యం. వారి ఉచ్చులో పడకుండా ఉండేందుకు ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్(Truecaller) ఆటో బ్లాక్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ALSO READ | Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
ప్రస్తుతం ఈ ఫీచర్ యాపిల్ ఐఫోన్లలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు ట్రూకాలర్ కో ఫౌండర్ అలాన్ మామెడి ఎక్స్ (గతంలో ట్విట్టర్) తెలిపారు. ట్రూకాలర్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ఎట్టకేలకు ఐఫోన్‌లో పని చేస్తోంది.. అని ఆయన ట్వీట్ చేశారు.
ఏంటి ఈ ఆటో-బ్లాక్ స్పామ్ ఫీచర్..?
ట్రూకాలర్‌లో ఆటో బ్లాక్ స్పామ్ ఫీచర్ అనేది స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. అంటే స్పామ్ కాల్స్ వచ్చిన సమయంలో మీ ఫోన్ రింగ్ అవ్వకుండా నిరోధిస్తుంది. బ్లాక్ చేసిన నంబర్లు ఏవనేది.. కాల్ లాగ్‌లో 'ఫ్రాడ్' లేదా 'స్కామర్'గా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ట్రూకాలర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆటో బ్లాక్ స్పామ్ ఫీచర్ ఉపయోగించడానికి ఐఫోన్ వినియోగదారులు తప్పనిసరిగా Apple స్టోర్ నుండి తాజా Truecaller వెర్షన్ 13.12కి అప్‌డేట్ చేసుకోవాలి.
రియల్ టైమ్ కాలర్ ID ఫీచర్
అదే సమయంలో ట్రూకాలర్.. రియల్ టైమ్ కాలర్ ID ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ iOS వినియోగదారులకు మాత్రమే. రియల్ టైమ్ కాలర్ ID ఫీచర్.. కాలర్ సమాచారాన్ని అందిస్తుంది. అవతలి వ్యక్తి ఎవరు..? ఏ సంస్థ నుండి కాల్ చేస్తున్నారు అనేది ముందుగానే తెలుసుకోవచ్చు.
లైవ్ కాలర్ ID లుక్అప్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి iPhone వినియోగదారులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
సెట్టింగ్స్ > యాప్‌లు > ఫోన్ > కాల్ బ్లాకింగ్ & ఐడెంటిఫికేషన్.. ఎనేబుల్.