అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డ్రొనాల్డ్ ట్రంప్, జో జైడెన్ ఫేస్ టు ఫేస్ డిబెట్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డ్రొనాల్డ్ ట్రంప్, జో జైడెన్ ఫేస్ టు ఫేస్ డిబెట్

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు జోరు పెంచారు. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న అధ్యక్ష ఎన్నిక‌ల్లో మ‌రోసారి డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్‌, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పోటీప‌డ‌నున్నారు. గురువారం ఇద్దరూ తొలిసారి టీవీ చ‌ర్చలో పాల్గొన్నారు. దేశంలోకి శ‌ర‌ణార్థులు చొర‌బ‌డుతున్నార‌న్న అంశంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మ‌ధ్య డిబెట్ జరిగింది. నేరాలు పెరిగిపోయినట్లు, పరిపాలనలో బాధ్యతలను విస్మరించారని ట్రంప్ బైడెన్ పై విరుచుకుపడ్డారు. 

జనవరి 6, 2021 తిరుగుబాటు, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలపై ఓ టీవీ ఛానల్ లో డిబెట్ నిర్వహించారు.తమ పాలనలో 40శాతం వలసలు తగ్గాయని బైడెన్ సమర్థించుకుంటే.. శాంతి భద్రతలు కూడా తగ్గాయని, ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయని ట్రంప్ ఆరోపించారు.నాటో విధివిదానాలు, అబార్షన్ యాక్సెస్ వంటి అంశాలపై ఇరువురి వాదనలు వినిపించారు.