- పెన్సిల్వేనియా వేదికగా ఫాక్స్ న్యూస్ ఏర్పాట్లు
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రెసిడెంట్ఎలక్షన్స్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ వైదొలగిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో భారత సంతతి మహిళ కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో ఆమెతో డిబేట్‌కు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఫాక్స్‌న్యూస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సెప్టెంబర్4న పెన్సిల్వేనియాలో కమలా హారిస్‌తో చర్చకు తాను సిద్ధమని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రుత్ వేదికగా ప్రకటించారు.
“సెప్టెంబర్ 4న ఫాక్స్‌న్యూస్ నిర్వహించే ఈవెంట్లో కమలా హారిస్‌తో డిబేట్‌కు నేను అంగీకరించా. వాస్తవానికి ఇదే తేదీన నేను ఏబీసీ చానల్లో జో బైడెన్‌తో చర్చలో పాల్గొనాల్సింది. కానీ, ఆయన అధ్యక్ష బరినుంచి తప్పుకున్నారు. దీంతో అది రద్దయింది” అని వెల్లడించారు. జూన్27న సీఎన్ఎన్చానల్లో బైడెన్ తో జరిగిన చర్చలోని రూల్స్.. ఈ డిబేట్‌కు కూడా వర్తిస్తాయని చెప్పారు. అలాగే, ఈ డిబేట్లో ఆడియన్స్కూడా ఉంటారని ట్రంప్ తెలిపారు.
డెమోక్రాట్ల అభ్యర్థిత్వం ఖరారు
పెన్సిల్వేనియాలో సెప్టెంబర్17న డిబేట్‌కు రావాలని గతంలోనే ఫాక్స్ న్యూస్ డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌కు ఆహ్వానం పంపింది. అయితే, హారిస్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో ట్రంప్ ఈ ఆహ్వానాన్ని నిరాకరించారు. తాజాగా, డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ ఖరారు కావడంతో ఆమెతో చర్చకు ట్రంప్ ఓకే చెప్పారు. అయితే, ఈ డిబేట్, దాని కండిషన్స్‌కు హారిస్ అంగీకరించారా? లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. గతంలో ట్రంప్‌తో డిబేట్‌కు సిద్ధమేనని కమలా హారిస్ ప్రకటించారు.
కమలపై ట్రంప్ వివాదాస్పద కామెంట్స్
కమలా హారిస్‌పై ట్రంప్చేసిన తాజా కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. షికాగోలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడారు. “కమలా హారిస్ నాకు పరోక్షంగా తెలుసు. ఆమె భారతీయ మూలాలున్న మహిళ. భారతీయ వారసత్వాన్ని ప్రమోట్ చేస్తారు” అని అన్నారు. ‘‘కొన్నేండ్ల కిందటి దాకా ఆమె నల్లజాతీయురాలని నాకు తెలియదు.
ఇప్పుడు ఆమె తనకు తాను నల్లజాతీయురాలినని చెప్పుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమైనా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. కమలా హారిస్ భారతీయురాలేనంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. కాగా, ట్రంప్ కామెంట్స్‌పై కమలా హారిస్ మండిపడ్డా రు. హ్యూస్టన్‌లో నిర్వహించిన బ్లాక్ సోరోరిటీ కన్వెన్షన్‌లో ఆమె మాట్లాడారు. ట్రంప్‌ది పాతకాలపు విభజనపూరిత ధోరణి అని ఫైర్ అయ్యారు.