ట్రంపా మజాకా.. టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో ఇండియాకు నష్టమే

ట్రంపా మజాకా.. టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో ఇండియాకు నష్టమే

న్యూఢిల్లీ: ఇండియాతో సహా యూఎస్‌‌‌‌‌‌‌‌తో వ్యాపారం చేస్తున్న అన్ని దేశాలపైనా పరస్పర టారిఫ్‌‌‌‌‌‌‌‌లు వేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. తమపై ఎంత టారిఫ్ వేస్తు న్నారో అంతే వేస్తామని, తక్కువా ఎక్కువా ఉండదని ప్రకటించారు. యూఎస్‌‌‌‌‌‌‌‌లో తయారు చేస్తే ఎటువంటి టారిఫ్‌‌‌‌‌‌‌‌లు ఉండవని అన్నారు.   

టారిఫ్‌‌‌‌‌‌‌‌లు వేసి కంపెనీలను ఆకర్షించాలని ఆయన చూస్తున్నారు. ఈ విధానం ఇండియాపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇండియన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై యూఎస్ సగటున 3 శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌ వేస్తుంటే,  యూఎస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై ఇండియా సగటున 10 శాతం వేస్తోంది. 

ట్రంప్ పరస్పర టారిఫ్ విధానాన్ని అమలు చేస్తే ఇండియన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై యూఎస్ వేసే టారిఫ్‌‌‌‌‌‌‌‌ రేటు  10 శాతానికి పెరుగుతుంది. ఇండియా నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌ దిగుమతి చేసుకుంటున్న ఫుడ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు, కూరగాయలు, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌, క్లాత్స్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రికల్ మెషినరీ, జెమ్స్, జ్యుయెలరీ, ఫార్మా, ఐరన్, స్టీల్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పడే అవకాశం ఉంది. 

ట్రంప్‌‌‌‌‌‌‌‌ టారిఫ్‌‌‌‌‌‌‌‌లకు స్పందనగా యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై టారిఫ్‌‌‌‌‌‌‌‌లు తగ్గించాలని ఇండియా చూస్తోంది.  పరస్పర టారిఫ్‌‌‌‌‌‌‌‌ విధానంతో ఇండియాతో పాటు జపాన్‌‌‌‌‌‌‌‌, యూరోపియన్ యూనియన్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా నష్టపోనున్నాయని అంచనా. 

యూఎస్ తన ట్రేడ్ పాలసీని మార్చడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా పెద్ద మార్పులు వస్తాయని, కస్టమర్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని, బిజినెస్‌‌‌‌‌‌‌‌ల ప్రాఫిట్స్ పడిపోతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.