
న్యూఢిల్లీ: మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వెహికల్స్, ఆటో పార్ట్స్‌పై వచ్చే నెల నుంచి 25 శాతం సుంకాలు విధించడం వల్ల భారతీయ ఆటో కంపెనీలు నష్టపోతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. మనదేశం నుంచి అమెరికాకు ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఆటో ఎగుమతులు జరుగుతున్నాయి. సుంకాల విధింపు వల్ల కంపెనీల మార్జిన్లు తగ్గుతాయని భావిస్తున్నారు. టాటా మోటార్స్ లగ్జరీ కార్ సబ్సిడరీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు నాలుగు వేల వెహికల్స్‌ను అమ్మింది. ఇవన్నీ యూకే ప్లాంట్ల నుంచి వెళ్లాయి.
టారిఫ్ వసూలు చేయడం వల్ల కంపెనీ లాభదాయకత తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. టారిఫ్‌ల భారాన్ని తట్టుకోవడానికి జేఎల్ఆర్ధరలు పెంచాలి. ఇదే జరిగితే మార్కెట్షేర్తగ్గవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. స్పేర్పార్ట్స్తయారు చేసే కంపెనీలపై మరింత ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. గత ఏడాది యూఎస్మనదేశం నుంచి 2.2 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను కొన్నది. అమెరికాకు ఎగుమతి చేసే స్పేర్ పార్ట్స్ ధర పెరుగుతుంది కాబట్టి అమ్మకాలు తగ్గే ప్రమాదం ఉంది. మనదేశం నుంచి ఆటో పార్టులు ఎగుమతి చేసే సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్, భారత్ ఫోర్జ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలకు సుంకాల దెబ్బ గట్టిగానే తగలనుంది. సోనా బీఎల్డబ్ల్యూ ఆదాయంలో 43 శాతం, భారత్ఫోర్జ్ ఆదాయంలో 38 శాతం అమెరికా నుంచే వస్తోంది. 25 శాతం టారిఫ్కట్టడం వల్ల కంపెనీల మార్జిన్150 బేసిస్‌పాయింట్ల వరకు పడిపోవచ్చని క్రిసిల్ తెలిపింది.