ట్రంప్ అనుకున్నట్లుగానే అమెరికాలో ఉన్న అక్రమవలసదారులను తరిమేస్తున్నారు. భారతీయులతో సహా అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ జరుగు తోంది. పత్రాలు లేని వలసదారులపై ట్రంప్ యొక్క కఠినమైన వైఖరిని అమలు చేసింది.మంగళవారం ( ఫిబ్రవరి 04) అమెరికా సైనిక విమానం లో టెక్సాస్ నుంచి 205 మంది భారతీయులను పంజాబ్‌కు తరలించారు.
అమెరికాలో 11 మిలియన్ల మంది ఎటువంటి అనుమతి లేకుండా ఉన్నట్లు గుర్తించిన డొనాల్డ్ ట్రంప్.. వారికి కఠిమైన చర్యలు తీసుకుంటున్నారు. బలవంతంగా అమె రికానుంచి వారి వారి దేశాలకు పంపిస్తున్నారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి 205 మంది భారతీయులతో బయలుదేరిన C-17 విమానం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరింది. అమెరికా నుంచి ఎటువంటి పత్రాలు లేని భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎంతమంది భారతీయులు ప్రభావితమవుతారు?
అమెరికాలో ఇతర దేశాలకు చెందిన ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని లేదా అక్రమ వలసదారులే లక్ష్యంగా ట్రంప్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా వేలాది మంది భారతీయ పౌరులపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 18వేల మంది భారతీయ వలసదారులను గుర్తించారు.
ALSO READ | PM Modi US tour: చైనాపై టారిఫ్ విధిస్తూనే.. ఇండియాకు ఆహ్వానం.. ట్రంప్-మోదీల వ్యూహమేంటి..?
ట్రంప్ చర్యలతో కనీసం 20,407 మంది ఎటువంటి ధృవ పత్రాలు లేని భారతీయులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వీరిలో 17,940 మంది తొలగింపు దారుల్లో ఉండగా.. మరో 2,467 మంది US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ERO) విభాగం కింద నిర్బంధంలో ఉన్నారు. ఈ గణాంకాలు 2022లో సేకకించబడినవి. ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చు.
ఎవరిని బహిష్కరిస్తున్నారు?
అమెరికాలో ఇతర దేశాలకు చెందిన ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని లేదా అక్రమ వలసదారులే లక్ష్యంగా ట్రంప్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇప్పటివరకు లాటిన్ అమెరికాకు సైనిక విమానాల ద్వారా మునుపటి జో బిడెన్ పరిపాలనలో పట్టుబడిన వ్యక్తులను వారి దేశాలకు తరలించారు. తాజా బహిష్కరణల కోసం వాణిజ్య విమానాలు, సైనిక విమానాలు రెండింటినీ ఉపయోగిస్తోంది ట్రంప్ ప్రభుత్వం.