అభివృద్ధి చెందిన దేశంగా ముద్ర…. మనకు బరువే!

డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం లో ని అమెరికా ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయంతో మనదేశం డబ్బుపరంగా పెద్ద ఎత్తున నష్టపోబోతోంది. ఇండియా ఇంతకాలం ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాల జాబితాలో ఉంది. అయితే మనదేశం, చైనా సహా ఓ డజను దేశాలను ఈ లిస్టు నుంచి అమెరికా తొలగించింది. ఈ దేశాలన్నీ ఇప్పటికే అభివృద్ధి చెందాయన్నది అమెరికా వాదన. ఈ పరిస్థితుల్లో ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాల లిస్టు నుంచి ఈ దేశాలను తొలగించి ‘అభివృద్ధి చెందిన’ దేశాల జాబితాలో అమెరికా చేర్చింది. డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న ఇండియా టూర్ కు వస్తున్న నేపథ్యం లో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచింది. ట్రంప్ టూర్ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఇప్పటివరకు అందరూ అనుకున్నా రు. అయితే మనదేశానికి సంబంధించి అమెరికా తీసుకున్న నిర్ణయంతో అసలు ‘ ట్రేడ్ డీల్ ’ ఉంటుందా ? అనే అనుమానాలు వస్తున్నాయి.

‘అభివృద్ధి చెందుతున్న’ లిస్టులో ఉంటే
ప్రపంచంలోని అనేక దేశాలతో అమెరికా బిజినెస్ చేస్తుంది. దీనికోసం బయటి దేశాలను మొత్తం మూడు కేటగిరీలుగా ‘యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ’ (యుఎస్ టీఆర్) డివైడ్ చేస్తుంది. ఇందులో ‘ అభివృద్ధి చెందుతున్న’, ‘అభివృద్ధి చెందిన’, ‘అతి తక్కువ స్థాయిలో అభివృద్ది చెందుతున్న’ అనే మూడు కేటగిరీలుంటాయి. ‘ అభివృద్ధి చెందుతున్న’ లిస్టులో ఉన్న దేశాలకు ‘అభివృద్ధి చెందిన’ దేశాలతో పోలిస్తే వాణిజ్యపరంగా చాలా లాభాలుంటాయి. సహజంగా పేద దేశాలకు డబ్బు సాయం చేసే ఉద్దేశంతో ఈ లిస్టు తయారు చేసింది అమెరికా. ‘అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974’ కు అనుబంధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే దేశాలను ఆదుకోవడానికి అమెరికా ఈ క్లాసిఫికేషన్ చేసింది.  దీన్ని జీఎస్పీ (జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సె స్) అంటారు. దీనికింద అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని అతి తక్కువగా అమెరికా వేస్తుంది. అమెరికా ఒక్కో దేశంతో చేసే ట్రేడ్ ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా టారిఫ్ లు ఉంటాయి. అన్ని దేశాలకు ఒకేరకమైన సుంకాలుండవు. ఆయా దేశాల ఆర్థిక స్థితిని బట్టి టారిఫ్ లు విధిస్తుంది. పేద దేశాలను, ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో పైకి వస్తున్న దేశాలను ఆదుకోవడమే టార్గెట్ గా ఒక్కో దేశానికి ఒక్కో రకమైన టారిఫ్ విధిస్తుంది అమెరికా.

2,000 వస్తువులకు టారిఫ్ అక్కర్లేదు
‘అభివృద్ది చెందుతున్న’ దేశాల లిస్టులో ఉండటంతో మనదేశం నుంచి దిగుమతి చేసుకునే 2000 రకాల వాటికి అమెరికా అతి తక్కువ సుంకాలు వేసేది. ఒకసారి ‘అభివృద్ధి చెందిన’ దేశాల లిస్టులోకి ఇండియా పేరు ఎక్కిన తరువాత ఈ వెసులుబాటు మనకుండదు. అభివృద్ధి చెందిన అన్ని దేశాలలాగా మనం కూడా భారీ ఎత్తున అక్కడ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మన ఎగుమతిదారులు ఇతర దేశాలతో పోటీ పడటం కష్టమవుతుంది. ఫలితంగా అమెరికాకు మన ఎగుమతులు పెద్ద ఎత్తున తగ్గిపోయే ప్రమాదం ఉదంటున్నా రు నిపుణులు. అమెరికా నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ ? అమెరికా, ఇండియా మధ్య ప్రస్తుతం ‘ట్రేడ్ ఎగ్రిమెంట్’ అమలులో ఉంది. ఈ ఎగ్రిమెంట్ కు ఒక టైమ్ ఫ్రేం అంటూ ఉంటుంది. ఒకసారి ఎగ్రిమెంట్ కుదిరిన తరువాత కాలపరిమితి ముగిసేం తవరకు అందులో ఎలాంటి మార్పులు చేయకూడదన్నది కనీస సూత్రం. రెండు దేశాల మధ్య ఉన్న ‘ట్రేడ్ ఎగ్రిమెంట్’ ను సమీక్షించిన తరువాతే అవసరమైతే మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అయితే రివ్యూ అంటూ చేయకుండానే, ఎగ్రిమెంట్ కాలపరిమితి ముగియకుండానే ఇండియాకు సంబంధించి అమెరికా ఇంత అకస్మాత్ తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్​ పర్స్ట్ . అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిరయ్ణం కేవలం ఇండియా వంటి కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే కాదు ప్రపంచ వాణిజ్యం పై కూడా పడుతుందంటున్నారు.

ట్రంప్ సర్కార్ ఏమంటోం ది ?
ఇండియా సహా కొన్ని దేశాల విషయంలో తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నా అమెరికా పట్టిం చుకోవడం లేదు. పైపెచ్చు తన నిర్ణయం కరెక్టే అంటోంది. తన నిర్ణయానికి మద్దతుగా ఇండియా కొన్నేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని వాదిస్తోంది. అభివృద్ధి చెంది కూడా ‘ అభివృద్ధి చెందని ’ దేశాల లిస్టులో కొనసాగుతూ పెద్ద ఎత్తున అనేక మినహాయింపులు, రాయితీలు తీసుకుంటోందని ఎదురు దాడి చేస్తోంది.