- ప్రజాస్వామ్యం కోసం
వాషింగ్టన్: ప్రజస్వామ్యానికి తాను ముప్పు అని ఇన్నాళ్లుగా డెమోక్రాట్లు చేస్తున్న ప్రచారాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు.
ప్రజాస్వామ్యం కోసం తాను బుల్లెట్ దెబ్బలు తిన్నానని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆదివారం మిషిగన్లో మొదటిసారి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం డెమోక్రాట్లే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని చెప్పారు.