ట్రంప్ ఎఫెక్ట్.. గ్రీన్​ కార్డున్నా.. హెచ్​1బీపై వెళ్లినా కఠినమే

ట్రంప్ ఎఫెక్ట్.. గ్రీన్​ కార్డున్నా.. హెచ్​1బీపై వెళ్లినా కఠినమే

ఎఫ్​1 వీసాలే కాదు.. అప్పటికే అమెరికాలో సెటిల్​ అయి గ్రీన్​ కార్డు ఉన్నవాళ్లు, హెచ్​1బీ వీసాపై జాబ్​ చేసే వాళ్లకూ ట్రంప్​ సర్కారు కఠిన నిబంధనలు విధించింది. గ్రీన్​ కార్డు ఉన్నంత మాత్రాన అది అమెరికా పౌరసత్వం అయిపోదని ట్రంప్​తోపాటు అక్కడి అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే గ్రీన్​ కార్డు ఉన్నవాళ్లు అమెరికా నుంచి తమ సొంతూళ్లకు వెళ్లి చాలా కాలం తర్వాత మళ్లీ అమెరికాకు వెళ్లినా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇమిగ్రేషన్​ నిపుణులు అంటున్నారు. 

6  నెలలకన్నా ఎక్కువ అమెరికా బయట ఉండి తిరిగి వచ్చేటోళ్లు ఇమిగ్రేషన్​ ఆఫీసులు, ఎయిర్​పోర్టుల్లో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. వారు అన్ని రోజులు వేరే ప్రాంతాల్లో గడపడానికి గల కారణాలపై కస్టమ్స్​, బోర్డర్​ సెక్యూరిటీ అధికారులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ప్రతి డాక్యుమెంట్​నూ నిశితంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. 

Also Read :- మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్, అలర్ట్

సొంత దేశ పాస్​పోర్టు, గ్రీన్​కార్డు, హెచ్​1బీ వీసా పర్మిట్​, రీఎంట్రీ పర్మిట్​, ఎంప్లాయ్​మెంట్​ వెరిఫికేషన్​ లెటర్​, ట్యాక్స్​పేమెంట్​ ప్రూఫ్, పే స్లిప్స్​, స్టూడెంట్లయితే యూనివర్సిటీ అడ్మిషన్​ లెటర్​, అమెరికా బ్యాంక్​ అకౌంట్​, అమెరికా డ్రైవింగ్​ లైసెన్స్​ వంటి డాక్యుమెంట్లన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు చెబుతున్నారు.