బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న హింసను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్ తో స్నేహం బలోపేతం చేస్తామన్నారు.
గురువారం(అక్టోబర్31) అమెరికాలో దీపావళి సందర్బంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ విస్మరించారని అన్నారు.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి ఉంది. హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనార్టీలపై దాడులు , దోపిడీకి గురవుతున్నారని.. ఈ అనాగరిక హింస తీవ్రంగా ఖండిస్తున్నానని ట్రంప్ ట్వీట్ చేశారు.
2017 నుంచి 2021 వరక తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్ తో స్నేహపూర్వక సంబంధాలనుకొనసాగించామన్నారు. ప్రధాని మోదీ, ట్రంప్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. 2019లో టెక్సాస్ లో హౌడీ మోదీ కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. అలాగే 2020లో అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్న విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు.