ట్రంప్ వింత నిర్ణయం.. మనుషులు లేని దీవిపై 10 శాతం టారిఫ్, రహస్యమేంటి..?

ట్రంప్ వింత నిర్ణయం.. మనుషులు లేని దీవిపై 10 శాతం టారిఫ్, రహస్యమేంటి..?

Trump Tariffs on Island: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ పనిచేసినా దానికొక లెక్కుంటది. ఎందుకంటే ఆయనొక వ్యాపారవేత్త. వ్యాపారవేత్తలు ఒక పనిచేయటానికి ముందు దానిని పలు కోణాల్లో పరిశీలిస్తుంటారు. నేడు ట్రంప్ దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న అంశం ఒకటి ఉంది.

ట్రంప్ తన తాజా టారిఫ్స్ ప్రకటనలో కేవలం పెంగ్విన్లు మాత్రమే నివసించే ఒక దీవిపై కూడా 10 శాతం సుంకాన్ని ప్రకటించమే. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవులపై పన్నులు ప్రకటించటమే. వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చేర్చింది. ఈ ప్రాంతం దాదాపు 80 శాతం మంచుతో కప్పబడి ఉంటుంది. రాతితో కూడిన ఈ దీవులు చీకటిగా ప్రజలు నివాసం లేకుండా ఉన్నాయి. 

ALSO READ | Trump Vs Kim: యూఎస్ టారిఫ్స్, పుతిన్- కిమ్ జోలికి వెళ్లని ట్రంప్.. ఎందుకంటే..?

అయితే అలాంటప్పుడు ఈ దీవులపై కూడా ట్రంప్ ఎందుకు పన్నులు విధించారనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం దొరికింది. వాస్తవానికి ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారిని ఉటంకిస్తూ ఆక్సియోస్ నివేదించింది. ఈ దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా పెంగ్విన్లు, సీల్స్ నివసిస్తుంటాయి.

ఆస్ట్రేలియా భూభాగం కిందకు వచ్చే ఈ దీవులకు చేరుకోవటానికి పెర్త్ నుండి రెండు వారాల పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం 2వేల మంది మాత్రమే నివసించే మరో ఆస్ట్రేలియా భూభాగమైన నార్ఫోక్ ద్వీపంపై 29 శాతం సుంకాన్ని ప్రకటించటం గమనార్హం. అలాగే కేవలం 2వేల 500 మంది మాత్రమే నివసిస్తున్న మారుమూలన నార్వేజియన్ భూభాగాలైన జాన్ మోయెన్, స్వాల్బార్డ్ ప్రాంతాలను సైతం ట్రంప్ తన తాజా టారిఫ్స్ ప్రకటనలో విడిచిపెట్టలేదు.

సంచలన నివేదిక..
ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం అమెరికా హెర్డ్ ఐలాండ్, మెక్ డొనాల్డ్ దీవుల నుంచి దాదాపు 1.4 మిలియన్ డాలర్లు విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నట్లు గార్డియన్ వార్తా సంస్థ నివేదించింది. కేవలం ఐస్, పెంగ్విన్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతం నుంచి మెషినరీ, ఎలక్టికల్స్ దిగుమతి చేసుకోవటం పెద్ద మిస్టరీగా అనిపిస్తోందని నివేదికలో పేర్కొంది. అందుకేనేమో ట్రంప్ ఈ మారుమూల జనావాసం లేని దీవులను సైతం విడిచిపెట్టకుండా తన టారిఫ్స్ కిందకు తీసుకొచ్చారు.