సివిల్ ఫ్రాడ్ కేసులో ట్రంప్​కు రూ. 3 వేల కోట్ల ఫైన్

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆర్గనైజేషన్ కు న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది. సివిల్ ఫ్రాడ్ కేసులో 355 మిలియన్ డాలర్ల (రూ. 2,946 కోట్లు) జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశించారు. ఆయన కుమారులు ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ లకు కూడా 4 మిలియన్ డాలర్ల చొప్పున ఫైన్ వేశారు. ట్రంప్ మూడేండ్ల పాటు న్యూయార్క్ లో కంపెనీ డైరెక్టర్‌‌‌‌గా వ్యవహరించకుండా నిషేధించారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన ఇద్దరు కుమారులు తమ నికర ఆస్తుల విలువను  భారీగా పెంచి బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్నారన్నది ఈ కేసులో ట్రంప్ పై మోపిన ప్రధాన అభియోగం.