అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ పై ట్రంప్ జోకులు

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ పై ట్రంప్ జోకులు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్​పై ట్రంప్ జోకులు పేల్చారు. గురువారం వైట్ హౌస్​లోని ఓవల్ ఆఫీసులో ఆయన ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను సునీతా విలియమ్స్ ను చూశాను. మంచి హెయిర్, సాలిడ్ హెడ్​తో చాలా బాగుంటుంది. వాళ్లిద్దరూ (సునీత, బుచ్) అక్కడ చిక్కుకుపోయారు. వారు ఒకరినొకరు ఇష్టపడుతుండొచ్చు. నాకు తెలియదు. కానీ ఇద్దరూ అక్కడే చిక్కుకుపోయారంటే ఆలోచించాల్సిందే” అని చమత్కరించారు.

మేమూ కూడా ఆపుతున్నాం: కెనడా 

టారిఫ్​ల వాయిదాపై ట్రంప్ ప్రకటన తర్వాత కెనడా మంత్రి డొమినిక్ లెబ్లాన్స్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘125 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై విధించిన టారిఫ్​ల అమలును మేం కూడా ఏప్రిల్ 2 దాకా నిలిపివేస్తున్నాం. అన్ని టారిఫ్​లను తొలగించేందుకు కృషి చేస్తున్నాం”అని డొమినిక్ తెలిపారు. అయితే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం అమెరికాతో తమ ట్రేడ్ వార్ అలాగే ఉందని గురువారం చెప్పారు.