![ట్రంప్ కూల్ అయ్యిండు..అవినీతి వ్యతిరేక చట్టాన్ని నిలిపేసిన ట్రంప్.. అదానీకి రిలీఫ్?](https://static.v6velugu.com/uploads/2025/02/trump-loosens-enforcement-of-us-law-banning-bribery-of-foreign-officials_MqHnGJktol.jpg)
- అదానీకి ఊరట ? అవినీతి వ్యతిరేక చట్టాన్ని నిలిపేసిన ట్రంప్
వాషింగ్టన్: విదేశీ అవినీతి వ్యతిరేక చట్టం అమలును నిలిపివేయాలని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల అదానీ గ్రూప్ చీఫ్గౌతమ్ అదానీకి ఊరట దొరికినట్టయింది. ఈ చట్టం ప్రకారమే అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా అమెరికాలో విచారణ జరుగుతోంది.
1977 నాటికి ఫారిన్కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ) వ్యాపార ప్రయోజనాల కోసం అమెరికా కంపెనీలు/విదేశీ సంస్థలు అధికారులకు లంచాలు ఇవ్వడాన్ని నిషేధిస్తుంది. దీనిని నిలిపివేయడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ఆర్డర్పై ట్రంప్సంతకం చేశారు.
సమీక్ష కోసం ఆరు నెలల గడువు ఇచ్చారు. సోలార్‌పవర్ కాంట్రాక్టుల కోసం అదానీతోపాటు మరికొందరు ఇండియా అధికారులకు లంచాలు ఇచ్చినట్టు అమెరికా జస్టిస్డిపార్ట్మెంట్ అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.