- అమెరికాలో 20 లక్షల మంది ఎంప్లాయిస్‌కు ట్రంప్ మెయిల్
- ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్స్ ఆఫర్
- స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే వారికి చాన్స్
- ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగు
- పాకిస్తాన్‌కు విదేశీ సహాయం నిలిపివేస్తూ ఆర్డర్స్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దేశంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా, ప్రభుత్య ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు బైఅవుట్స్ఆఫర్ ప్రకటించారు. ఏ ఫెడరల్ ఉద్యోగి అయినా స్వచ్ఛందంగా జాబ్మానేస్తే 8 నెలల సాలరీ ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఒక మెమో రిలీజ్ చేసింది. దేశంలోని మొత్తం 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపించారు. వచ్చే నెల 6 లోపు నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు.
ఉద్యోగం మానేయడం ఇష్టమైతే మెయిల్‌కు ‘ఎస్’ అని సమాధానం ఇవ్వాలన్నారు. ఇమ్మిగ్రేషన్, నేషనల్ సెక్యూరిటీ సంబంధిత, యూఎస్ పోస్టల్ సర్వీస్ఎంప్లాయిస్ను ఇందులోనుంచి మినహాయించారు. కొవిడ్ తర్వాత రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కారు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో దాదాపు 5–10 శాతం ఎంప్లాయిస్ బైఅవుట్స్ఆఫర్ను ఎంచుకునే అవకాశం ఉందని అక్కడి నిపుణులు చెప్తున్నారు. ఈ విధానంతో అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు.
పాకిస్తాన్‌కు సాయం నిలిపివేత
పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపేసింది. విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు సస్పెండ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌లో భాగంగా ఇది అమల్లోకి వచ్చినట్టు పాకిస్తాన్‌లోని యూఎస్ ఎంబసీ అధికారి తెలిపారు. ఈ సాయాలన్నీ అమెరికా విధానాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనేది సమీక్షించాలన్నారు. సాయం నిలిపివేతతో పాకిస్తాన్లో ఎనర్జీ సెక్టార్‌కు సంబంధించిన 5 ప్రాజెక్టులు నిలిచిపోనున్నాయని తెలిపారు.